Telugu News

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్

కంటితుడుపుగా హామీలు ఇస్తున్నా ప్రజాప్రతినిధులు

0

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్

== ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు

== అర్ధాకలి బతుకుని ఈడుస్తున్న మత్స్యకారులు

== కాగితాలకే పరిమితం అయిన ప్రతిపాదనలు

 == కంటితుడుపుగా హామీలు ఇస్తున్నా ప్రజాప్రతినిధులు

(రిపోర్టర్ : శివనాగిరెడ్డి)

 చండ్రుగొండ సెప్టెంబర్ 19 ( విజయం న్యూస్ ):-

రైతే రాజు,దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషం కోసం రాష్ట్ర సర్కార్ విశేష కృషి చేస్తుందని, ప్రతి రాజకీయ పార్టీ ప్రకటనలకు,వాగ్దానాలకు కై పరిమితమవుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా రైతుల కోసం ఎక్కడలేని విధంగా వారి కోసం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వ్యవసాయాన్ని పండగలా గా మార్చాము అని ప్రతి రాజకీయ పార్టీ సొంత డోలు కొట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: అశ్వారావుపేట లో టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..

వివరాల్లోకెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల ప్రధాన సాగునీరు వనరులైనా సీతయి గూడెం వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్ సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు కింద చండ్రుగొండ, దామరచర్ల, సీతాయిగూడెం, ఇమ్మడి రామయ్య  బంజర్, తిప్పన పల్లి, మహమ్మద్ నగర్, అయ్యన్నపాలెం, గ్రామాలకు చెందిన రైతులు కుడి, ఎడమ కాలువల కింద అధికారికంగా 2200 వేల ఎకరాలలు సాగు చేయాల్సి ఉండగా 3000 ఎకరాలులో  ఈ ప్రాజెక్టు కింద ప్రధానంగా రైతులు వరి పంట ఎక్కువ సేద్యం  చేస్తున్నారు .

==  ప్రమాద ఘడియలు మోగిస్తున్న వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్

గడిచిన 5 సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ. సుమారు 5.40 కోట్ల అంచనాతో కట్ట ప్రతిష్ఠత, తూములు, కాల్వల పనులు చేశారు. గత రెండు సంవత్సరాల క్రితం   వరద తాకిడి రావడంతో  ప్రాజెక్టు కుడి పక్కన ఉన్న అలుగు భారీ ఎత్తున కోతకు గురైంది. ఆ సమయంలో  అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్ వి రెడ్డి ప్రాజెక్ట్ ను పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు నిమిత్తం రూ.9.50 లక్షల రూపాయలు విడుదల చేసి వరద మళ్లింపు కాల్వ నిర్మించారు . గత ఏడాది ఇప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రాజెక్ట్ ను సందర్శించి వరద మళ్లింపు పనులను పరిశీలించారు. ఈ ఏడాది వరద మళ్లింపు కై రూ.9 లక్షలు తాత్కాలిక మరమ్మతులు కోసం మంజూరు చేశారు. 

ఇది కూడా చదవండి:- మునుగోడులో బిజెపి,టీఆర్ఎస్ లను  ఓడించాలి: భట్టి విక్రమార్క

ప్రాజెక్ట్ అలుగు పక్కన ఇసుకతో నింపిన  బస్తాలు వేయాల్సి ఉండగా ఉండంగా మట్టి బస్తాలు వేసి నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది తాత్కాలిక మరమ్మతుల పేరుతో  లక్ష రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఏటా పెరుగుతున్న వరద తాకిడికి అలుగు భారీగా కోతకు గురవుతుంది.  దీంతో ప్రాజెక్ట్  కుచ్చుచుకు పోతుంది. మిషన్ కాకతీయ నిధులతో చేసిన కట్ట ప్రతిష్ఠత కోతకు గురి అవుతూ కాలిబాట గా మారింది. కుడి, ఎడమ కాలవలు అడుగడుగున లీకేజీ అవుతున్నాయి. ప్రాజెక్ట్ పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదపు అంచుల్లో మారి రాబోవు రోజుల్లో కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా నిర్మించిన మట్టి కట్టడాలు కరిగి పోయి ప్రాజెక్టులోని కలిసిపోతున్నాయి. ప్రాజెక్టు లోతట్టు కోతకు గురై భారీ ఎత్తున గుంతలు ఏర్పడుతున్నాయి.

==  ఆందోళనలో వ్యక్తం చేస్తున్న ఆయకట్టు  రైతులు   

ఆయకట్టు చివరి పొలాలకు సాగు నీరు అందించాల్సిన లక్ష్యం నీరు కారుతుంది.  ప్రాజెక్టు పరిస్థితి బాగా లేకపోవడంతో  ఆయకట్టు  విస్తీర్ణం ప్రతి ఏటా తగ్గిపోతుంది. ఈ ఏడాది 600 ఎకరాల్లో పంట సేద్యం  చేయలేదు. మహమ్మద్ నగర్, తిప్పన పల్లి, వెంగళరావు కాలనీ తదితర గ్రామాల్లో సాగునీరు అందక పంటలు వేయలేదని బహిరంగంగా రైతులు అంటున్నారు. రైతులు ప్రాజెక్ట్ దుస్థితిపై ఫిర్యాదు చేయాలి అన్న సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎవరికి చెప్పాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు.  ప్రతి ఏడాది వంట చివరి ఈ సమయంలో  సాగునీరు అందక ఎండి పోతున్నాయని రైతులు  వాపోతున్నారు. కుడి,ఎడమ కాలువలకు చిన్నచిన్న గండ్ల ను తామే పొడుచుకుంటున్నమని రైతులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు  చర్యలు తీసుకొని శాశ్వత మరమ్మతు పనులను చేయించాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు.

 == అర్ధాకలితో బతుకుని ఈ డుస్తున్నా మన మత్స్యకారులు       ఇది కూడా చదవండి: చిన్నారి మేఘన అదృశ్యంపై వీడని మిస్టరీ……? 

ప్రాజెక్టు పైనే ఆధారపడ్డ  మత్స్యకారుల జీవనశైలి అర్ధాకలితో గడుపుతున్నారు. ప్రాజెక్టు కింద  సొసైటీ ద్వారా 100 కుటుంబాలు పైన చేపల పెంపకం పై కుటుంబ పోషణ చేస్తున్నారు. అలుగు కోతకు గురవడంతో ప్రాజెక్టు లో వేసిన చేపలు వరద ఉధృతి కొట్టుకుపోతున్నాయి అని వారు వాపోతున్నారు.  ప్రాజెక్ట్ అడుగు కు శాశ్వత నిర్మాణం చేయకపోవడంతో  గత రెండేళ్లుగా తాము  చేపల పెంపకం చేయలేకపోతున్నామని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం ఉచితంగా చేపల పిల్లలు పంపిణీ చేసింన తమ జీవనాధారానికి ఉపయోగపడటం లేదని వారు తెలిపారు.

==  కాగితాలకే పరిమితం అయిన ప్రతిపాదనలు

ప్రాజెక్ట్ అలుకు  శాశ్వత నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇరిగేషన్ శాఖ రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రాజెక్ట్ ను సందర్శించి  ప్రతిపాదనలు పంపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో 5 కోట్లతో పంపిన అంచనాలను, నేడు పెరిగిన ధరల దృష్ట్యా రూ. 25 కోట్లకు చేరింది.  ఆయకట్టు రైతులు అధికారులు అడగ్గా రూ.25 కోట్లు ప్రతిపాదనలు పంపామని మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు అని ఆయకట్టు రైతులు అంటున్నారు.

== కంటితుడుపుగా హామీలు ఇస్తున్న ప్రజాప్రతినిధులు

చండ్రుగొండ మండల పర్యటనకు వచ్చే ప్రజా ప్రతినిధులు ప్రాజెక్టు పరిస్థితిపై చెబుతూ ప్రతిపాదనలు పంపామని, రూ.25 కోట్లు నిధులు మంజూరు అవుతాయని, రైతులకు ఇస్తున్న హామీలు పకటన లకై పరిమితమవుతున్నాయి. ఇటీవల అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మండల పర్యటనకు వచ్చిన సమయం లో రైతులు ప్రాజెక్టులు నిర్మాణం పై  రైతులు విన్నవించుకున్నారు.  ఆ సమయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపాదనలు పంపామని మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని సమాధానం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు అని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఇరిగేషన్ శాఖ అధికారులతో  సమావేశం నిర్వహించి ప్రాజెక్ట్ పరిస్థితిపై సమీక్షించాలని రైతులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : వల్లభిలో హత్య

== ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు:స్థానిక వెంకటేశ్వర్లు (  ఆయుకట్ట రైతు దామరచర్ల)

వెంగళ రావు సాగర్ ప్రాజెక్ట్ పనితీరు అధ్వానంగా ఉందని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.  పట్టించుకోవడం లేదు అలుగు కోతకు గురై సాగునీరు వృధాగా పోవడంతో పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు పెట్టలేక నష్టపోతున్నాం. సమృద్ధిగా వర్షాలు పడుతున్నా, అలుగు నిర్మాణం చేపట్టకపోవడంతో నీరు వృధాగా పోతుంది.ప్రాజెక్టు కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. అడుగున లీకేజ్ అవుతూ నీరు వృధాగా పోతుంది. ఇప్పటికైనా  అధికారులు స్పందించి, అలుగు కు శాశ్వత నిర్మాణం పనులు చేయాలలి. ప్రాజెక్టుపై పంపిన ప్రతిపాదనలను మంజూరు చేసేందుకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

 

== జీవనాధారం కష్టమవుతుంది : (పిట్టల ప్రసాద్) ( మత్స్యకారుడు, సీతయిగూడెం)

కోతకు గురైన ప్రాజెక్టులకు శాశ్వత నిర్మాణాలు చేపట్టకపోవడంతో చేప పిల్లల పెంపకo కష్టంగా మారింది. ప్రాజెక్టు లో వేసిన చేప పిల్లలు వరద వృద్ధి కి కొట్టుకుపోవడంతో వాటి మీద ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసిన అలుగు కోతకు గురవడం తో  వాటి పెంపకం చేయలేకపోతున్నాం.  ఇప్పటికైనా అలుగు నిర్మాణానికి శాశ్వత చర్యలు చేపట్టి మా మత్స్యకారుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.