Telugu News

గుత్తికోయలు వర్సెస్ ఫారెస్ట్ అధికారులు

చండ్రుగొండలో ఏళ్లుగా రగులుతున్న పోడు పంచాయతీ

0

గుత్తికోయలు వర్సెస్ ఫారెస్ట్ అధికారులు

== చండ్రగొండకు వందల కుటుంబాల

== చండ్రుగొండలో ఏళ్లుగా రగులుతున్న పోడు పంచాయతీ

(చండ్రుగొండ-విజయంన్యూస్)

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా  పోడు పంచాయతీ రగులుతోంది.. జిల్లాలో ఫారెస్టు అధికారులకు, వలస గుత్తికోయలకు మధ్య ఎన్నో ఏళ్లుగా పగ రగులుతోంది. చత్తీస్ గడ్ నుంచి గడిచిన 25ఏళ్ల నుంచి వందలాధి మంది వలసవాదులు(గుత్తికోయలు) అశ్వరరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ సమీప అటవిప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం సుమారు 40 కుటుంబాలు చండ్రగొండ మండలం బెండాలపాడు ప్రాంత అటవిలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.  అక్కడ పోడు భూములు సాగు చేస్తూ జీవిస్తున్నారు. అటవిలో గుడిసెలు వేసుకుని ఏళ్ల పాటు నివాసం ఉంటున్నారు. వారికి కరెంట్ సౌకర్యం లేదు. ఆధార్ సౌకర్యంలేదు.. అడవిలో మగ్గుతున్నారు.అయినప్పటికి అడవిని వదలడం లేదు.

allso read-: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య

ఫారెస్ట్ అధికారులు వారిని నివారించే ప్రయత్నం చేసిన, వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఒత్తడి తీసుకొచ్చిన ఫలితం లేకుండాపోయింది.. అటవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వందల  ఎకరాల్లో అటవిని నరికివేసి వ్యవసాయం సాగు చేస్తున్నారు. బావులను తవ్వుకుని నీటి సౌకర్యం కల్పించుకుంటున్నారు. గత మూడేళ్ల క్రితం బావి తవ్వుకున్నట్లు తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ సందర్శించి ఆ భావిని పూడ్చేశారు. మళ్లీ మరో బావిని తీయగా, ఆ బావి ఎక్కడ ఉందో బయటపడలేదని తెలుస్తోంది. అనంతరం వలసగుత్తికోయలు సుమారు 100 ఎకరాల్లో ఫారెస్ట్ ను నరికివేస్తూ వ్యవసాయం సాగు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, సిబ్బంది ఆ భూమిని స్వాధినం చేసుకుని హరితహారం మొక్కలను నాటారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం సర్వే చేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను నరికేసేందుకు గుత్తికోయలు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఎఫ్ఆర్ఓపై గుత్తికోయలు పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సమయం చూసి ఫారెస్ట్ అధికారులపై  దాడి చేసి హత్య చేసినట్లుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

allso read- తుమ్మల, రేగా కలిశారు..అంతర్యమేంటో..?