అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.
★★ సాయిబాబా, మహాలక్ష్మి, ముత్యాలమ్మ విగ్రహాల ప్రతిష్టలు..
★★ వేలాదిగా హాజరైన భక్తులు..
★★ ప్రముఖుల రాకతో కిక్కిరిసిన ఆలయాలు..
★★ ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు..
చండ్రుగొండ ఆగస్టు 7 ( విజయం న్యూస్ ):-
మండల కేంద్రమైన చండ్రుగొండ నిర్మించిన నూతన ఆలయలైనా సాయిబాబా, మహాలక్ష్మి, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
Allso read:- అందర్ని కలిసి మాట్లాడతా: భట్టి
ఆదివారం ఉదయం మహాలక్ష్మి వార్ల యాత్ర, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మైసమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల యంత్ర విగ్రహ ప్రతిష్ట, భక్తాంజనేయ స్వామి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, విశ్వనాథ లింగేశ్వర స్వామి వార్ల యంత్ర, శివలింగ ప్రతిష్ట, షిరిడి సాయి నాధుని యంత్ర, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు వేదపండితులు వివిఆర్ కె మూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నడుమ ప్రతిష్టించారు. ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానo కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుల్ల సత్యనారాయణ, జడ్పిటిసి కొనకొండ్ల వెంకట రెడ్డి , ఎంపీటీసీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దా రా బాబు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, మాలోత్ బొజ్జ్య నాయక్, మేడ మోహన్ రావు, గాదె లింగయ్య, ముఖ్య ప్రతిష్ట కమిటీ బాధ్యులు చీదెళ పవన్ కుమార్, నాగిరెడ్డి, పెద్దిని వేణు,సంకా కృపాకర్, సూర వెంకటేశ్వరరావు, కడియాల నాగేశ్వరరావు , సంకా శంకర్, మరకాల రవీందర్ రెడ్డి, నన్నక నవీన్ కుమార్, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు
Allso read:- ఆయన దారేటు..?