నీరు “కారుతున్న” డబుల్ ఇండ్లు
** నాసరికం ఇండ్ల నిర్మాణంతో లబ్ధిదారులకు తలనొప్పి….
** క్షణంక్షణం భయంభయంగా బతుకుతున్న నిరుపేదలు….
** కదిలిస్తే కన్నీళ్లే…
** బాధ్యులెవరు..?
** ఆరోపణలున్న పట్టించుకోని అధికారులు…
చండ్రుగొండ జులై 9 ( విజయం న్యూస్):-
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులు తో ఇల్లు నిర్మించి ఇస్తున్నామని, ఇన్నాళ్లు పూరి గుడిసెలో నిరుపేదలు ఇప్పుడు ఆత్మగౌరవం తో జీవిస్తారని పెద్ద పెద్ద బహిరంగ సభలలో చెప్పటమే కానీ ఆచరణలో మాత్రం శూన్యం….
Allso read:- ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం
నిరుపేదల నీడ కోసం ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ పథకం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్మాణంలో గుత్తేదారు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని అందుకు అనుగుణంగా ఏటా నిధులు కేటాయిస్తుంది. నిధుల దుర్వినియోగం అవుతున్నాయి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు లక్షలు ఖర్చుచేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెబితే కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తితో నాసిరకంగా ఇల్లు నిర్మించి, పేదవాడి ప్రాణాలతో చాలగటం ఆడుతున్నారు…
వివరాల్లోకి వెళితే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండల పరిధిలోని మద్దుకూరు గ్రామపంచాయతీలో నిర్మించిన సుమారు కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో 30 డబుల్ బెడ్ రూములు నిర్మాణం జరిగింది. ఇటీవల కాలంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఇతర ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను ప్రారంభించారు. కానీ ఏడాది క్రితమే లబ్ధిదారులు, నివాసం ఉంటున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మొక్కుబడిగా, అధికారంగా ప్రారంభించడం విశేషం. నిర్మాణ సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ లేకపోవడం కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా కడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.
నిర్మాణ సమయంలో గ్రామస్తులు నాసిరకంగా నిర్మిస్తున్నారు అని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లను ముగ్గురు కాంట్రాక్టర్ నిర్మించారు. ఇక్కడ నిర్మించిన 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో సుమారు 15 ఇళ్లు పూర్తిగా చమ్మా దిగటం, నీరు కారడం జరుగుతుంది.
Allso read:- *ఖమ్మం మార్కెట్ లో మిర్చి ధర రికార్డ్
గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి ఇల్లంత పూర్తిగా చెమ్మగిల్లి గోడలు నిమ్ము తేలుతున్నాయి. గోడలు చెమ్మగిల్లి ఇళ్లలోకి నీరుకారడం తో రాత్రిళ్లు నిద్రపోవడానికి కూడా నానా అవస్థలు పడుతున్నాం … ఎప్పుడు అవుతుందో అని , గోడలకు షార్ట్ సర్క్యూట్ వస్తుందేమో అని భయంతో నివసిస్తున్నారు. ఇలానే ఇంటిలో నీరు కారడం వలన ఇంటిలోఉన్న సామానులు పూర్తిగా పాడై పోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా నిర్మాణం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కంటే గతంలో మేము నివసించిన ఇల్లు లే చుక్క నీరు కారకుండా బతకమని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు అంటున్నారు.
అస్తవ్యస్తంగా రోడ్లు : డబుల్ బెడ్రూం నిర్మాణం జరిగిన లబ్ధిదారు ఇల్లులు ముందు కాళ్ళు తీసి కాలు పెట్టలైఅంత ఇది గా బురదమయంగా ఉంది. పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ కూడా దుర్భరంగా ఉంది. ఈ వర్షాకాలంలో వచ్చే రీజనల్ వ్యాధులు, వ్యాపించకుండా ఉండాలంటే అధికారులు తక్షణమే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి.
◆◆ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తాం
ఏఈ.సుబ్బరాజు :- మద్దుకూరు డబుల్ బెడ్రూం నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తాం. ఇటీవల కాలంలో ప్రారంభించిన సందర్భంగా ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులు చేసిన ఫిర్యాదు మేరకు నోటీసు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో నే పనులు పూర్తి చేస్తాం..