Telugu News

చంద్రుగొండలో పోడుదారులు, పారెస్టు అధికారుల మధ్య ఘర్షణ

పలువురికి గాయాలు

0
చంద్రుగొండలో  పోడు వివాదం..ఘర్షణ.. ఉద్రిక్తం
– పోడు సాగు దారులకు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ
– ఫారెస్ట్ అధికారులపై విరుచుకుపడ్డ పోడుసాగు దారులు 
– ఫారెస్ట్ అధికారులకు గాయాలు 
– చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
(రిపోర్టర్: శివనాగిరెడ్డి)
చండ్రుగొండ, జులై 29(విజయం న్యూస్ ):-
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోడు పంచాయతీ అగడం లేదు.. నిత్యం ఎక్కడో ఒక చోట పోడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. పోడు దారులు వ్యవసాయం చేయడం, పారెస్టు అధికారులు వాటిని దున్నేందుకు వెళ్లడం, అక్కడ ఘర్షణ జరగడం, కేసులు కావడం.. ఇది పరిపాటిగా జరుగుతోంది. ప్రస్తుతం శుక్రవారం కూడా చంద్రుగొండ మండలంలో మరో సంఘటన జరిగింది. పారెస్టు అధికారులకు, పోడు దారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు అధికారులు, పోడు దారులు గాయపడ్డారు. వారందర్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
చండ్రుగొండ మండలం లోని  మద్దుకూరు బీట్ పరిధిలోని మంగలి గుంపు ప్రాంతంలో శుక్రవారం ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు సుమారు 60 మంది ఈ భూములు తమవేనని ప్లాంటేషన్ పనులను అడ్డుకున్నారు.. ప్లాంటేషన్ వేసిన మొక్కలను పోటు సాగుదారులు తొలగించడంతో ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోడు దారులకు, పారెస్టు అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినోకరు కొట్టుకున్నారు. అయితే  ఫారెస్ట్ అధికారులు తక్కువ మంది ఉండటంతో ఒక్కసారిగా పోడు సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేయడం జరిగింది. దీంతో ఫారెస్ట్ అధికారులు గాయాలయ్యాయి. కొంత మంది పోడుదారులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.  వెంటనే వారిని పోలీసులు సహాయంతో చండ్రుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మద్దుకూరు బీట్ పరిధిలోని మంగలి గుంపు పరిధిలో ఫారెస్ట్  ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది మా పనులను అడ్డుకొని మా సిబ్బందిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారన్నారు. ఇందులో ఐదుగురికి గాయాలయ్యాయి అన్నారు. బీట్ ఆఫీసర్లు భాస్కర్, శ్రావణ్, దేవ్ సింగ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు నాగరాజు, రామారావు, గాయాలన్నారు ఇందులో బీట్ ఆఫీసర్ రామారావుకు ఎడమ చేయి ఎముకకు ప్యాచర్ అవడంతో అతన్ని వెంటనే కొత్తగూడెం పంపించడం జరిగిందన్నారు. ఈ దాడిలో పూర్తిగా చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన వారు పాల్గొన్నారు. ఈ భూములకి వారికి ఎలాంటి సంబంధం లేదని కావాలని చెప్పి ఫారెస్ట్ అధికారులపై ఇలా దాడులు చేయడం సబబు కాదన్నారు.