Telugu News

చండ్రుగొండలో ‘హరితహారం’ ఆగం.. మాగం..

నీరుగారుతున్న సర్కార్ ప్రతిష్టాత్మక పథక లక్ష్యం

0

హరితహారం ఆగం.. మాగం..

== నీరుగారుతున్న సర్కార్ ప్రతిష్టాత్మక పథక లక్ష్యం

==  సంరక్షణ కరువై చనిపోతున్న మొక్కలు

== పట్టించుకుని అధికారులు

 చండ్రుగొండ సెప్టెంబర్ 5 (విజయం న్యూస్):-

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్టుగా తయారైంది మండలంలోని హరితహారం పథకం పరిస్థితి… అధికారుల వైఫల్యమో..? ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ఫలితమేమో కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అపహాస్యం అవుతుంది. రాష్ట్రంలో 25.16 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంచే అద్భుతమైన పథకం తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొక్కల పెంపకం తో పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుండగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ల,నిర్లక్ష్యంతో లక్ష్యం నీరు కారుతుంది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతిఏటా వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలం లోని  14 పంచాయతీల్లో ప్రతి ఏటా లక్షల రూపాయలు వెచ్చించి మొక్కల పెంపకం చేపట్టారు.

alls0 read- ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. ప్రజలు, అభివృద్దే శాశ్వతం: తుమ్మల

ప్రభుత్వ శాఖల వారీగా టార్గెట్ ను నిర్దేశించి మొక్కలు నాటే బాధ్యత అధికారులకు అప్పగించారు. ప్రారంభంలో రెండేళ్లపాటు ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామాలలోని చెరువు గట్లపై, రోడ్డు వెంబడి ఇరువైపుల మొక్కలు నాటారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకురావడంతో పాటు రోజు సంబంధిత  ఉన్నత అధికారుల స్థాయిలో తీసుకుంటూ మండలం లో మొక్కలు కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా 2019 హరితహారం లో భాగంగా గ్రామానికి  ఒక నర్సరీ  కేటాయించారు. దానిలోనే గ్రామానికి సంబంధించిన మొక్కల పెంపకాన్ని, పండ్లు, పూల మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. దానికి గ్రామ పంచాయతీలోని నిధులు కూడా కేటాయిస్తూ, దాని సంరక్షణ గా వ్యక్తి నియమించి వారికి కూడా ఎన్ ర్ జి ఎస్ పథకంలో  రోజువారి మస్టర్ లేస్తూ మొక్కల సంరక్షణ గా నియమించారు.

 == కరువైన సంరక్షణ..???

హరిత హారంలో అమలులో మొక్కల పంపిణీ, నాటే కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆరాటపడుతున్నారు. కానీ నాటిన మొక్కల సంరక్షణ  పట్టించుకునే నాధుడే కరువై మొక్కలు ఎండిపోతున్నాయి. గత ఇరవై రోజుల నుండి ఎండలు తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మొక్కలకు కనీసం నీరు పోసిన దాఖలాలు మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. హరితహారం భాగంలో నాటిన మొక్కలు తో పాటు మొక్కలకు ఏర్పాటుచేసిన ట్రీ గార్డ్ లో పిచ్చి పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీల్లో మేకలు, ఆవులు, గేదలు చెట్లను విరగ  కొట్టినా  సంబంధిత అధికారులు,పాలకవర్గం సభ్యులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు  అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ ను ప్రభుత్వం అందించిన దానిని ఉపయోగించకపోవడం తో  పంచాయతీ ఆఫీసు లో అలంకార ప్రాయంగా ఉందని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

allso read- రేషన్ దుకాణాల్లో  (రా)బందువులు

 == కోట్ల రూపాయల నిధులు నిరుపయోగం..

ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్న హరితహారం కార్యక్రమం లో నిర్లక్ష్యం కారణంగా పనికిరాకుండా పోయింది. ఒక పక్క అడవులు లేకపోవడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుందoటు అంటూ ప్రభుత్వం అడవులను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంది. కానీ ఈ హరితహారం పథకం కింద నాటిన మొక్కలను పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, ప్రజా ప్రతినిధులు పట్టింపులేని తనం కిందిస్థాయి ఉద్యోగుల పర్యవేక్షణ లోపంతో నాటిన మొక్కను కాపాడేందుకు నీరుపోసె దిక్కులేక మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆశయం నీరుకారిపోతుంది. లక్షల రూపాయలు పెట్టి పెంచిన మొక్కలను నాటిన తర్వాత సంరక్షించే లేకపోవడంతో ఐదేళ్లు అధికారాన్ని ఖర్చుచేసిన కోట్ల రూపాయలు నిధులు బూడిదలో పోసిన పన్నీరు లా మారిపోయాయి.