Telugu News

చండ్రుగొండ ఆర్టీ (ఛీ ) బస్టాండ్

నిరుపయోగంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం.

0

ఆర్టీ (ఛీ ) బస్టాండ్

== నిరుపయోగంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం.
== ఆదాయం పైనే ఆశ…. సౌకర్యాల కల్పన ఎక్కడ.
== ఎవరికీ పట్టని ప్రయాణికుల ఇబ్బంది.
(రిపోర్టర్- శివనాగిరెడ్డి)
 చండ్రుగొండ ఆగష్టు 23(విజయం న్యూస్ ):-
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతుంది. ప్రయాణికుల సౌకర్యార్ధం మండల కేంద్రంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణం ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా బస్టాండ్ ప్రారంభోత్సవం జరిగింది. నేటికీ బస్టాండ్ నిర్మించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది..
 జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లి, డిపోలకు చెందిన బస్సు తో పాటు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన బస్సులు నిత్యం ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజు సుమారు 200 పైగా సర్వీసులను నడుస్తుంటాయి. ఉదయం,మధ్యాహ్న, సాయంత్ర సమయంలో కొన్ని బస్సులు హోటల్లో భోజనం చేసేందుకు అగుతుంటాయి. ఆ సమయంలో బస్సులోని ప్రయాణికులు ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మూత్రశాల లకు కు వెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా బస్టాండ్ ఆవరణలో పాన్ షాపులు, సెలూన్ షాపులు, మెకానిక్ షాప్ లు, చికెన్ షాప్ లు ఇలాంటివి ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నెలవారీ ఆర్టీసి సిబ్బంది ఒక్కొక్క షాప్ నుండి నెల నెల అద్దె వసూలు చేస్తున్నారు. ఆదాయం ఉన్న కనీస సౌకర్యాలు కల్పించక పోవడం వల్ల ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
 == ప్రయాణికుల సౌకర్యం పై శ్రద్ధ వహించడంలేదు..
 ఆర్టీసీ అధికారులు ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధ సౌకర్యాలు చూపించడం లేదు. దాదాపు 26 ఏళ్ళ క్రితం నిర్మించిన ప్రయాణం ఎంతవరకు ఉపయోగం తీసుకురా లేదంటే ఆర్టీసీ అధికారులు శ్రద్ధ ఎంత ఉందో ఊహించుకోవచ్చు. ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు, త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇలాంటి వాటికి ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణికుల నుంచి ఒక్క శాతం అదనంగా వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు గాను వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఏళ్లు గడుస్తున్న ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణ ప్రాంగణం ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రయాణికుల కనీస సౌకర్యాలు కల్పించాలి.
== అసాంఘిక కార్యక్రమాలకు బస్టాండు అడ్డాగా మారిన బస్టాండ్ ..
 రాత్రి సమయంలో బస్టాండ్ లో కరెంట్ సౌకర్యం లేకపోవడం తో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. పలువురు యువకులు బస్ స్టాండ్ ను అడ్డాగా చేసుకుని మందు, సిగరెట్,గంజాయి తాగుతున్నట్లు సమాచారం. సమాచారం ఉన్నప్పుడే పోలీసులు పెట్రోలింగ్ చేయడం పరిపాటిగా మారింది..
== మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడండి..
 మారుమూల గ్రామాలలో సైతం ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సర్కారు నిధులు ఖర్చు చేస్తుంది. కానీ ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆయా సందర్భాల్లో మండల కేంద్రంలో బస్టాండ్ లో ప్రజలు కనీస వసతులు లేక నరకయాతన పడుతున్నారు. బస్టాండ్ లో మౌలిక వసతులు కల్పించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మహిళా ప్రజలు కోరుతున్నారు.
==  బస్టాండ్ ప్రాంగణం లో కంట్రోలర్ న్ని ఏర్పాటు చేయాలి…
 రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ ని ఏర్పాటు చేయడం వల్ల బస్సులు బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో బస్సులో ఎక్కేందుకు ఎక్కడ నిలబడాలో అర్థం కాక బస్సు వచ్చే సమయంలో ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. వృద్ధులు,వికలాంగులు, చిన్న పిల్లలు బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోవాల్సి వస్తుంది, కొన్ని సమయాల్లో కిందపడడం కూడా జరుగుతుంది.