Telugu News

మళ్లీ రాజుకుంటున్న పోడు రగడ.

** అర్ధరాత్రి వేలా పోడు భూములు లాక్కొంటున్నా ఫారెస్ట్ అధికారులు

0

మళ్లీ రాజుకుంటున్న పోడు రగడ
** అర్ధరాత్రి వేలా పోడు భూములు లాక్కొంటున్నా ఫారెస్ట్ అధికారులు
** ఒక పక్క ప్రభుత్వం పట్టాలు ఇస్తామంటున్నారు
** మరోపక్క భూములను లాక్కుంటున్నారు.
** లాక్కున్న పోడు భూములు లో వంటావార్పు కార్యక్రమాన్ని చేస్తున్న పోడు దారులు.
(చండ్రుగొండ -విజయం న్యూస్ ):

ఒక వైపు పోడు భూముల సమస్యను పరిష్కరిసానని, పట్టాలిస్తామని ఒక వైపు ప్రభుత్వం హామి ఇస్తుంటే.. మరో వైపు పారెస్టు అధికారులు తమ పనితాము చేసుకుంటూ వెళ్తున్నారు.. పోడు భూములను స్వాధినం చేసుకునేందుకు పారెస్టు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థరాత్రి పోడు భూములకు వెళ్లిన అధికారులు భూములను స్వాధినం చేసుకుని, రైతులు సాగు చేసిన పంటను నాశనం చేస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే

మండల పరిధిలోని తిప్పనపల్లి బిట్ పరిధిలోగల పోడు భూమిలో టెంటు వేసి, వంటా-వార్పు ను కార్యక్రమాన్ని నిర్వహించారు. పోడు భూముల్లో నిరసన దీక్షలు చేపట్టారు.
ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని చట్టాలు చేసినా, పోడు దారులకి స్పష్టమైన హామీ ని ఇవ్వలేకపోతోంది…… ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తున్నాo అంటున్న.. కానీ అధికారులు అర్ధరాత్రివేళ పోడు సాగు చేసుకునే దారులు నుంచి భూములు లాక్కోవటం ఏమిటని పోడు దారులు ప్రశ్నిస్తున్నారు…….. ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుంచి పోడు సాగు చేసుకుని జీవితం వెళ్ళదీస్తున్న మని ఇప్పుడు వచ్చి పోడు భూములు లాక్కొని మా జీవితాలు అంధకారం చేయొద్దని కన్నీటి పర్యంతం అవుతున్నారు….

ఈ పోడు భూమిని 1992 నుంచి సాగు చేస్తున్నామని, ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు వచ్చి మీకు హక్కు పత్రాలు లేవని సాకు తో లాక్కోవడం సరికాదన్నారు…..
1997 సంవత్సరంలో సుమారు 24 మంది పై ఫారెస్ట్ అధికారులు కేసు పెట్టి జైలుకు పంపారని… ఎంతో రకంగా ఇబ్బందులకు గురి చేసిన, మా పై దాడులు చేసినా కానీ మేము పోడు ని నమ్ముకుని జీవిస్తున్నాం తప్ప…. ఏనాడూ కూడా అధికారులకు మేము ఎదురు తిరిగి సమాధానం చెప్పలేదు…… పోడు భూమి ని వదిలిపెట్టేది లేదని…… ప్రాణాలైనా ఇస్తాం కానీ ఈ భూమిని వదిలి పెట్టమని ఎన్ని రోజులైనా కానీ ఇప్పుడు భూముల్లోని దీక్ష చేపడతామని తెలిపారు.. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం మాకు ఈ భూమికి సంబంధించిన పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు…

 

దుంప వీరస్వామి…
1992 నుంచి ఇప్పటివరకు ఈ పోడు భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నామని.. అర్ధరాత్రివేళ ఫారెస్ట్ అధికారులు మాభూమి లాక్కోవటం జరిగింది.. నేను ఇప్పటివరకు రెండు సార్లు జైలు కూడా వెళ్లి వచ్చాను అని…. నాకున్న ఈ పోడు భూములు లో నై వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని మాకు ఈ పోడు భూములకు పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను..

దుంప కమల…..
గత 30 సంవత్సరాల నుంచి ఈ పోడు భూమి సాగు చేసుకుని జీవితాన్ని వెళ్లదీస్తున్న మని ఇప్పుడు ఈ భూములు లాక్కోవటం వల్ల మా జీవితాలు రోడ్డున పడతాయని.. మాకు దిక్కెవరు… కెసిఆర్ గారు పట్టాలు ఇస్తామంటూ నే మళ్లీ మా భూములులాక్కుంటున్నారు.. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం వదిలి పెట్టే పరిస్థితి లేదు .

ALLSO READ :- ఈటెల ఘన ‘విజయం’

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*