Telugu News

చండ్రుగొండలో పెంచిన గ్యాస్ ధరలను నిరసనగా ధర్నా

పాల్గొన్న ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు

0

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసనగా ధర్నా…
పాల్గొన్న ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు
చండ్రుగొండ జులై 7 ( విజయం న్యూస్):- మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు చండ్రుగొండ ప్రధాన సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పై టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…

Allso read:- గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు: కాంగ్రెస్..*
కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోతున్న ప్రజానీకం గ్యాస్ ధరలు పెంచి సామాన్య పై భారం మోపడం కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేనియెడల కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన పార్లమెంట్లో నిలదీస్తాం. దండయాత్రకు వచ్చినట్లు వచ్చి హైదరాబాదు లో రెండు రోజులు మీటింగ్ పెట్టుకుని వెళ్లి ప్రజల పై గ్యాస్ భారం మోపారు. మాయ, మోసపు మాటలు మాట్లాడే వారికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్రం తప్పుడు విధానాల వల్ల రూపాయి విలువ పడిపోవడం, డాలర్ పెరిగిందని ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణా అభివృద్ధి అడ్డుకుంటుంది. కేంద్రం తప్పుడు విధానాల వల్ల రైతులు, యువత, నిరుద్యోగులు, అన్ని వర్గాల వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, చండ్రుగొండ మండల అధ్యక్షుడు దార వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పు తల ఏడుకొండలు, చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్, రసూల్, ఉపాధ్యక్షులు ఉన్నం నాగరాజు, భూపతి శ్రీనివాస రావు, సత్తి నాగేశ్వరరావు, సూర వెంకటేశ్వర్లు, దార రత్నాకర్, పవన్ కుమార్, మేడ మోహన్ రావు పోచం హనుమంతరావు, అనుములు హనుమంతరావు, చలవాది నరసింహారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు