Telugu News

చర్లలో మావోల ప్రజా కోర్టు

మాజీ నక్సలైట్ కు క్షమాభిక్ష పెట్టిన మావోలు

0

తెలంగాణాలో మావోల ప్రజా కోర్టు కలకలం…

== చర్ల అడవుల్లో ప్రజాకోర్టు నిర్వహించిన నక్సల్స్..

== జీవన్ అనే మాజీ నక్సల్ ను కిడ్నాప్ చేసి పోలీస్ ఇన్ ఫార్మర్ గా ఆరోపణలు..

== మొదటి తప్పుగా భావించి క్షమాభిక్షతో వదిలేసిన మావోయిస్టులు..

== ప్రజాకోర్టులో నిర్వహణలో పాల్గొన్న మావోయిస్టు నేతలు ఆజాద్, అరుణ, మధు, రజిత తదితరులు

భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి, ఆగస్టు 23(విజయంన్యూస్)

తెలంగాణలో మావోయిస్టుల కలయికలు మళ్లీ మొదలైయినట్లు కనిపిస్తోంది.. ఒక వైపు తెలంగాణ రాష్ట్రంలో మావోల అలజడి తగ్గిపోయిందని తెలంగాణ పోలీసులు చెబుతున్నప్పటికి మరో వైపు మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకుంటూనే ఉన్నారనేది ఈ రోజు సంఘటనే ప్రధాన సాక్ష్యంగా నిలిచింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ నక్సలైట్ జీవన్  పోలీస్ ఇన్ ఫార్మర్ గా భావించిన మావోయిస్టులు మంగళవారం కిడ్నాప్ చేసి ప్రజాకోర్టు నిర్వహించినట్లు సమాచారం. ప్రజల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించగా, ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మొదటి తప్పుగా భావించి క్షమాభిక్ష పెట్టి వదిలేసినట్లు తెలుస్తోంది.. మరోసారి ఏ మాత్రం డౌట్ వచ్చిన వదిలేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఈ ప్రజా కోర్టులో మవోయిస్టులు నేతలు అజాద్, అరుణ, మధు, రజిత తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చ దవండి : కనులపండుగగా ‘పువ్వాడ’ వారి వివాహ రిసెప్షన్
మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయిన జీవన్ ను పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గత నాలుగు రోజుల క్రితం చర్ల మండలం కిష్టారంపాడు గ్రామం నుంచి ఆజాద్ నేతృత్వంలోని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు..దండకారణ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి అతడు చేసిన తప్పులను ప్రజల ముందు ఒప్పించి తీవ్రంగా మందలించి అతడికి ఒక అవకాశం ఇచ్చి విడిచిపెట్టారు..తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం జగ్గారం జీవన్ సొంత గ్రామం కాగా మావోయిస్టు పార్టీలో పనిచేసేటప్పుడు చర్ల మండలం కిష్టారంపాడు గ్రామానికి చెందిన గంగి అనే యువతిని పెళ్లి చేసుకుని వారిద్దరూ మావోయిస్టు పార్టీలో పనిచేశారు..వ్యక్తిగత కారణాలతో 2021 మార్చిలో పోలీసుల ఎదుట లొంగిపోయి భార్య సొంత ఊరైన కిష్టారంపాడులో ఉంటున్నారు..జీవన్ పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ కిడ్నాప్ చేసి మావోయిస్టు పార్టీ బికె ఎఎస్ఆర్ జిల్లాల కమిటీ కార్యదర్శి ఆజాద్,మధు, అరుణ,రజితల నేతృత్వంలో ప్రజాకోర్టు నిర్వహించి తీవ్ర హెచ్చరికల అనంతరం క్షమాభిక్ష పెట్టి జీవన్ వదిలివేశారు..మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తే మరోలా ఉంటుందని మావోల హెచ్చరించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి : జీవితం పై విరక్తి చెందిన యువకుడు ఏం చేశాడంటే.?