Telugu News

చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు మవోయిస్టులు మృతి

0

చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ 

ముగ్గురు మావోయిస్టులు మృతి

— ఘటనా స్థలం లో మృతదేహాలతో పాటు లభించిన తుపాకులు 

(చత్తీస్ ఘడ్ -విజయం న్యూస్)

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో మరోసారి బాంబుల మోత మోగింది.. చత్తీస్ ఘడ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.. తెలంగాణ రాష్ర్ట సరిహద్దు ములుగు జిల్లా సమీప చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తర్లగూడ అటవి ప్రాంతంలోని పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం.అలాగే మరో ఐదుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. అయితే మృతులకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఎన్ కౌంటర్ జరిగినట్లు ఏఎస్పి గౌస్ ఆలం ధ్రువీకరించారు. మావోయిస్టులు ఎంత మంది చనిపోయారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో ఏకే 47 రైఫిల్ తో పాటు విప్లవ సాహిత్యం దొరికినట్లు సమాచారం. ఎన్ కౌంటర్ స్థలం కు పోలీస్ పార్టీలు వెళుతున్నాయని సమాచారం. ఆ ఘటన వద్దకు వెళ్తే కానీ అసలు ప్రమాద ఘటన వివరాలు పూర్తిగా తెలియరాదు. దీంతో తెలంగాణ రాష్ర్ట సరిహద్దులో పోలీసులు అప్రమత్తమైయ్యారు.

ALSO READ :- హుజూరాబాద్‌కు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలు