Telugu News

రెచ్చిపోయిన మావోయిస్టులు

నారాయణపూర్ జిల్లాలో ఘటన

0

రెచ్చిపోయిన మావోయిస్టులు

– రోడ్డు పనులకు ఉపయోగిస్తున్న నాలుగు వాహనాలకు నిప్పు

– నారాయణపూర్ జిల్లాలో ఘటన

(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో నిశ్శబ్దంమాటున మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని రెంగబెడలో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న నాలుగు వాహనాలకు గురువారం మావోయిస్టులు నిప్పు పెట్టారు. మంటల్లో నాలుగు వాహనాలు పూర్తిగా దగ్ధమైనాయి. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనను అదనపు పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్‌‌కుమార్ ధృవీకరించారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించారు.

గృహిణి” ఆశ గెలిచింది..!!