బీజాపూర్ లో ఎన్ కౌంటర్..
◆◆ ముగ్గురు మావోయిస్టులు మృతి
◆◆ భారీగా తుపాకీలూ స్వాధీనం
చత్తీస్ ఘడ్, జూన్ 22(విజయంన్యూస్)
మిర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుద్మేర్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం సాయంత్రం 04.15 గంటలకు కుద్మేర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని మగ మావోయిస్టు మృతి చెందగా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం దగ్గర నుండి పలు సంఖ్యలో కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.భైరామ్‌గఢ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో, డీఆర్జీ పోలీస్ స్టేషన్ మిర్టూరు సంయుక్త దళం మిర్టూర్ ప్రాంతంలోని కుద్మేర్ గ్రామం వైపు పెట్రోలింగ్ శోధనకు బయలుదేరగా పెట్రోలింగ్ సెర్చ్ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కుద్మేర్ అటవీ ప్రాంతంలో పోలీసులు-నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ తర్వాత సంఘటన స్థలాన్ని శోధించిన తరువాత, గుర్తుతెలియని మగ మావోయిస్టు మృతి చెందారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతదేహం దగ్గర నుండి పలు సంఖ్యలో కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు..ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు,పేలుడు పదార్థాలు,స్వాధీనం చేసుకున్న పోలీసులు.ధృవీకరించిన జిల్లా ఎఎస్పీ పంకజ్ శుక్లా
Allso read:- గులాబీ పార్టీకి తాటి ఝలక్..