Telugu News

ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నగర కమిటీ

0

ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు
== ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నగర కమిటీ
(ఖమ్మం-విజయంన్యూస్)
భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పైకేసు నమోదు చేయాలని నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం నగరంలోని టూ టౌన్, త్రీ టౌన్, అర్బన్ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ “మనల్ని మనం రక్షించుకోవడానికి అంబేడ్కర్ మనకు ఇచ్చిన ఆయుధం ఈ రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని పాతి పెట్టాలని కేసిఆర్ కుట్ర చేస్తుండని, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం రాసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు నేరపూరితమని అన్నారు. కెసిఆర్ చేసిన విమర్శలు రాష్ట్ర దేశ ప్రజలు మనోవేదనకు గురి చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాలరాసినట్టు అయిందని ఆరోపించారు.

also read :-స్మార్ట్ కిడ్జ్”లో వేడుకగా వసంత పంచమి., 

also read;-మన రాజ్యాంగాన్ని ఇది విలువ లేని రాజ్యాంగం అని విమర్శించడం ముఖ్యమంత్రి అధికార దాహానికి దర్పం పడుతుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పదవి కిఅనర్హుడని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు మళ్లీడు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నగర కాంగ్రెస్ నాయకులు ఏలూరు రవి, శ్రీశైలం యాదవ్, శంకర్ నాయక్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.