Telugu News

నేడు కొత్తగూడెంకు ముఖ్యమంత్రి రాక

పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగులేటి

0

నేడు కొత్తగూడెంకు ముఖ్యమంత్రి రాక

== పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగులేటి

 

(కొత్తగూడెం-విజయం న్యూస్):

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈనెల నాలుగో తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక  ప్రకాశం స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం రాత్రి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పలు సూచనలు చేశారు.  ఉదయం 11 గంటలకు స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏర్పాట్లు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొదేం వీరయ్య, టీజేఎస్ శివ, కొత్తగూడెం ఎన్నికల సమన్వయకర్త తుళ్లూరు బ్రహ్మయ్య, నాయకులు ఆళ్ల మురళి, చీకటి కార్తీక్, కనకరాజు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:- రఘురాం రెడ్డిని ఆదరించి.. కాంగ్రెస్ కే జై కొడదాం