బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా
సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ప్రియాంక
(ముంబై-విజయంన్యూస్)
గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా తల్లైయ్యింది. ఆమె బిడ్డకు జన్మనించ్చింది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా గుడ్‌న్యూస్ చెప్పింది. సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ సమయంలో తమకు ప్రైవసీ ఇవ్వాలని అభిమానుల్ని కోరింది.
also read :-విశాఖ మణ్యంలో చలిపులి
2018లో ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జనవరిలో ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల గురించి అడగ్గా ఆసక్తికర సమాధానమిచ్చింది. పిల్లలు, కెరీర్ ను తను బ్యాలెన్స్ చేసుకోగలనని చెప్పింది. ప్రియాంక నటించిన ’ద మ్యాట్రిక్ 4’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె నటించిన హిందీ సినిమా ’ద వైట్ టైగర్’.. నెట్?ప్లిక్స్?లో రిలీజైంది. ప్రస్తుతం ’సిటాడెల్’ అనే టీవీ షోలో నటిస్తోంది. ’టెక్ట్స్ ఫర్ యూ’ సినిమాలోనూ నటిస్తూ ప్రియాంక బిజీగా ఉంది.