108లో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా కోటపల్లి గ్రామ సమీపంలో అంబులెన్స్ లో ప్రసవించిన ఘటన సోమవారం జరిగింది
108లో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం
(వేమనపల్లి – విజయం న్యూస్):-
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా కోటపల్లి గ్రామ సమీపంలో అంబులెన్స్ లో ప్రసవించిన ఘటన సోమవారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం రాచర్ల గ్రామానికి చెందిన చెన్నూరి అశ్విని (25) పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు.
also read :- అభివృద్ధిలో టీకన్నపల్లి ఆదర్శం
ఆమెను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్సు ని పక్కకు పెట్టి జివికె(ఈఎంఆర్ఐ) ప్రధాన కార్యాలయం డాక్టర్ తో సెల్ ఫోన్లో సంప్రదించి సుఖ ప్రసవం చేశారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు, వారికి మెరుగైన చికిత్స కోసం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తరలించినట్లు అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ కత్రోజి ప్రవీణ్, పైలెట్ ఇమాం షరీఫ్, ఆశా వర్కర్ భారతి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
also read :- వైన్స్ షాప్ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. హెచ్చు ధరలతో విక్రయాలు.