Telugu News

 తోటి విద్యార్థికి  విద్యార్థుల చేయూత

కూసంపూడి మహేష్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్.

0

 తోటి విద్యార్థికి  విద్యార్థుల చేయూత

==  కూసంపూడి మహేష్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్.

(సత్తుపల్లి-విజయం న్యూస్)

బుడిబుడి నడకలతో ముద్దు ముద్దు మాటలతోనిత్యం పాఠశాలలో అందరి మన్ననలను పొంది తీవ్ర అనారోగ్యానికి గురై ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకటవ తరగతి విద్యార్థి తోటకూర లికిన్ సాయి వైద్య చికిత్స నిమిత్తం పాత సెంటర్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సహకారంతో,  12,222 రూపాయలు సేకరించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి వర్గంలో ‘పాలేరు’ అభ్యర్థి ఎవరు..?

శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహేష్ మాట్లాడుతూపేదరికంలో ఉన్న రామకృష్ణశాంతి ప్రియ దంపతుల కుమారుడు ఊపిరితిత్తుల వ్యాధితోఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న సహచర విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పి ఉపాధ్యాయుల పాఠశాల యాజమాన్య కమిటీ,  కౌన్సిలర్ షేక్ మౌలాలి సహకారంతో సహచర విద్యార్థికి సహాయపడాలి అనే భావంప్రాథమిక విద్యా దశలోనే దాతృత్వం లక్షణాలను కలిగి ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. సత్తుపల్లి 18 వ వార్డు కౌన్సిలర్ గ్రాండ్ మౌలాలి సమక్షంలో విద్యార్థులు సేకరించిన విరాళాన్ని లిఖిన్ సాయి తల్లి శాంతిప్రియ కు మున్సిపల్ చైర్మన్ మహేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ మౌలాలి మాట్లాడుతూ చిన్నారి లిఖిన్ సాయి వైద్య చికిత్స విషయంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననితమ వంతు సహకారాన్ని అందిస్తానని రోదిస్తున్న విద్యార్థి తల్లికి హామీ ఇచ్చి ఓదార్చారు.,ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నరుకుళ్ల శ్రీనివాసరావుఎస్.ఎం.సి. చైర్మన్ పాశం వెంకటేశ్వరరావుపాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఆస్మా,  కవితశిరీష,లక్ష్మిస్రవంతివాణి నాగూర్ బీఅనీషాఅబ్దుల్లానాగుల్ మీరాగురుమూర్తిఉపాధ్యాయులు నాగమణిజయశ్రీలాల్ అహ్మద్పవన్నరసింహారావు  విద్యార్థుల తల్లిదండ్రులుపాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: శ్రీ చైతన్య టెక్నో స్కూల్ భవనం పై నుంచి పడ్డ టెన్త్ క్లాస్ విద్యార్థి