Telugu News

ఎంపీడీవో కార్యాలయమా..? టీఆర్ఎస్ కార్యాలయమా..?

చింతలమనేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో టీఆర్ఎస్ సమావేశం

0

ఎంపిడిఓ కార్యాలయం మా.. టిఆర్ఎస్ కార్యకర్తల కార్యాలయం మా…

మండల పరిషత్ కార్యాలయంలో టీఆర్ఎస్ సమావేశం

— ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు 

(చింతలమనేపల్లి -విజయం న్యూస్)

మండల పరిషత్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం నిర్వహించడం పట్ల బీజేపీ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది మండల పరిషత్ కార్యాలయమా..? లేక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా..? అంటూ నిలదిసే ప్రయత్నం చేశారు. శనివారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని చింతలమనేపల్లి మండలం ఎంపిడిఓ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశం విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ మండల అధ్యఓుడు ధోని శ్రీశైలం అధికారులపై తీవ్రంగా విమ్మర్శలు చేశారు. ఈ మేరకు శనివారం విలేకర్లతో మాట్లాడారు. మండల పరిషత్ కార్యాలయంలో పార్టీ మీటింగ్  నిర్వహించాడం ఎంటి ? …అది మండల కార్యాలయమా.. లేక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మీటింగ్ హల్ నా.. ఇది ఎక్కడి న్యాయం..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ఎంపీపీ కి, ఎంపీడీవోకు తెలిసి జరిగిందా..? తెలియక జరిగిందా..? అని ప్రశ్నించారు.  ఇక నుంచి ఆఫీస్కు పేరు మార్చి, జెండా పెట్టేస్తే ప్రజలు వచ్చేవారు వస్తారు.. రాని వారు రారని ఆయన దుయ్యబట్టారు.  వెంటనే పర్మిషన్ ఇచ్చిన ఎంపీడీఓను తక్షణమే విధుల నుంచి తొలగించాలని,  లేని పక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో లో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాము అని అన్నారు. మండలంలో దుర్ఘటన మైన సంఘటనలు జరుగుతున్న కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని , తక్షణమే ఎంపీడీవో ను పదవి నుంచి తొలగించాలి లేకపోతే మేము కూడా బిజెపి పార్టీ సమావేశం నిర్వహిస్తాము మా కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరారు. జరిగిన ఘటనను పలువురు విమర్శనికి దారి తీస్తుంది..

also read :- మంచిర్యాలజిల్లాలో భూ కంపం..

‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’