Telugu News

సెయింట్ జోసఫ్స్ కో- కెథడ్రల్ చర్చి గుట్టలబజార్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు .

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

0

సెయింట్ జోసఫ్స్ కో- కెథడ్రల్ చర్చి గుట్టలబజార్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు .

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):-

సెయింట్ జోసఫ్స్ స్కూల్ ప్రాంతంలో సెయింట్ జోసఫ్స్ కో- కెథడ్రల్ చర్చి ఆధ్వర్యంలో చర్చి ఫాదర్ లాజర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రవేన్సిల్ ప్రసంగీకులు ఓసిఢీ రెవ. ఫాదర్ బి. జయరాజ్ పాల్గొని మాట్లాడారు .

తదనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రభువు కుమారుడు మనుషి రూపంలో మరల మరల జన్మించిన ఉన్నారని , ప్రభువు దైవభక్తి కలిగి ఉండాలని , అందరూ మంచి మార్గంలో నడవాలని , ప్రభువు యొక్క ప్రేమానురాగాలు పొందాలని , అందరూ ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ దేశ – రాష్ట్ర ప్రజలు ప్రభువు కృపను , దీవెనలతో పాటు దేవుడి ఆశీర్వాదాలు పొందాలని సూచించారు .

తదనంతరం వచ్చిన దైవ భక్తులకు ప్రభువు సందేశాన్ని అందించారు . అలాగే సెయింట్ జోసఫ్స్ చర్చి ఫాదర్ లాజర్ మాట్లాడుతూ ప్రభువు పుట్టిన రోజు వేడుకలను క్రిస్టియన్ సోదరీ – సోదరులు ఒక పెద్ద పండుగగా భావిస్తారని , లోక రక్షకుడు జన్మించిన రోజునే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని , అందరితో ఆప్యాయంగా , ప్రేమానురాగాలతో ఉండాలని , అందరూ మన సోదరీ – సోదరులే అనే భావంతో ముందుకు నడుస్తున్నారని , క్రిస్టియన్లు ఎవరికి వ్యతిరేకం కాదని , ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరారు .

బాలశౌరి సంగీతం మరియు ప్రభాకర్ పాటలు బృందం చే సంగీత ఆలాపనలు చేసి , చర్చి ప్రాంగణంలో విద్యుత్ దీపాల క్రాంతులతో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో విచారణ గురువులు , బ్రదర్స్ , సిస్టర్స్ మరియు సంఘ పెద్దలు , సెయింట్ జోసఫ్స్ కో-కెథడ్రల్ చర్చి గుట్టలబజార్ కమిటీ సభ్యులు , ప్రభువు బిడ్డలు అత్యధిక సంఖ్యలలో పాల్గొన్నారు .

 

 

also read :- పిట్రోల్ బంక్ పనులపై రెవెన్యూ & పారెస్ట్, అధికారుల దాడులు ఆపాలి,