అప్పుడే మొదలైన రైతు కష్టాలు.
== విత్తనాలు మొలకెత్తిoదుకు రైతులు నానా పాట్లు.
== రెండోసారి విత్తనాలు విత్తుతునా రైతులు…
చండ్రుగొండ జూన్ 21 ( విజయం న్యూస్):- వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి.. నైరుతి రుతుపవనాలు ముందే వస్తాయన్న ప్రచారంతో మండలంలో పలు గ్రామాల రైతులు పొడిదుడుకుల్లో నే పత్తి విత్తనాలు సాగు శ్రీకారం చుట్టారు. రైతుబంధు, వ్యవసాయ రుణాలు సకాలంలో ఇవ్వకపోవడంతో వడ్డీ లపై అప్పులు తెచ్చి పత్తి సాగు ను చేస్తున్నారు. పొడిదుడుకుల్లో పత్తి విత్తనాలు సాగు ద్వారా పురుగు, తెగుళ్ళను అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులు ఆశలు సీజన్ ప్రారంభ దశలోనే అడియాశలయ్యాయి. మండలంలో పత్తిని వ్యాపార, వాణిజ్య పంటగా ఎక్కువ మంది రైతులు సాగు చేస్తుంటారు. మండలంలో సుమారు 3 వేల నుంచి 4 వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తుంటారు. మండలంలో చండ్రుగొండ, గుర్రంగూడెం, బెండా లపాడు, రావికంపాడు, బాలి కుంట, పోకలగూడెం, గానుగపాడు, తుంగారం, తిప్పన పల్లి, మగయ్య బంజార గ్రామంలో ఇప్పటికే సుమారు 1000 ఎకరాలు పైగా పొ డిదుడుకుల్లో పత్తి విత్తనాలు వేశారు.. ఇప్పటికే ఎకరానికి విత్తనాలు, దుక్కులు, కూలీల ఖర్చు గాను పదివేల పెట్టుబడులు పెట్టారు.
ALLSO READ_ ఇట్టా అయితే నేనుబోతా..? తాటి
మొలిచిన మొక్కలకు నీరు పోసి బ్రతికిస్తున్న రైతులు….
గత కొన్ని రోజుల నుండి ఆకాశం మేఘావృతమై ఉండి, మబ్బులు పట్టి ఆశించిన స్థాయిలో వర్షం కురవడంతో, అడపాదడపా కురిసిన జల్లులతో మొలిచిన మొక్కలను బతికించేందుకు, రైతులు ట్యాంకర్లతో, డ్రమ్ముల తో నీళ్లు తెచ్చి కూలీలతో మొక్కలు పోస్తున్నారు. ఇప్పటికే వేల రూపాయలు అప్పులు తెచ్చి, విత్తనాలు నాటితే సరైన, వర్షం లేక, మళ్లీ విత్తనాలు విత్తే సోoమత లేదని, రైతులు కన్నీటి పర్వతం అవుతున్నారు…