Telugu News

చుండూరు-కారంచెడు నరమేధమే ఖమ్మంలో పోటీ

బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాండ్ర మల్లయ్య యాదవ్

0

చుండూరు-కారంచెడు నరమేధమే ఖమ్మంలో పోటీ
— దళిత బహుజనులను అణచివేసే కమ్మ, రెడ్డిలను ఓడించండి
— బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాండ్ర మల్లయ్య యాదవ్

ఖమ్మం, మే 10(విజయం న్యూస్):

కారంచెడు, చుండూరులలో నరమేధాన్ని సృష్టించిన రక్తమే ఖమ్మం గడ్డపై పోటీ చేస్తుందని, ఆ కమ్మ, రెడ్డిలను ఓడించాలని బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాండ్ర మల్లయ్య యాదవ్, మాల గుదపదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ధారా వెంకయ్యలు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ, బహుజన కమ్యూనిస్టు పార్టీ లు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంతోని సురేష్ డక్కలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని దళిత బహుజన కులాలు అంతోని సురేష్ డక్కలికి మద్దతు నిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బిజెపి లు దళిత బహుజన జాతులను వంచించే పార్టీలేనని అన్నారు. బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు అని, బహుజన రాజ్యమే ప్రత్యామ్నాయం అన్నారు. బహుజన మహాసభ రాష్ట్ర నాయకులు నారా బోయిన వెంకట యాదవ్ మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి:- రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ మాత్రమే: రాహుల్ గాంధీ

బిజెపి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ గా శ్రీరామున్ని తీసుకువచ్చింది. కానీ ఆ శ్రీరాముడే శంభుకున్ని చంపి ఆనాడే తన కుల ఆధిపత్యాన్ని చాటాడన్నారు. అందుకే మతోన్మాద పార్టీ అయిన బీజేపీ దళిత బహుజన జాతులను ఏ స్థాయిలో ఉంచుతుందో బహుజన సమాజం అర్థం చేసుకోవాలన్నారు.
బహుజన కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అంతోనీ సురేష్ మాట్లాడుతూ.. నన్ను గెలిపించినట్లయితే ఈ జిల్లాలో పేదరికంను నిర్మూలిస్తానని, ఇంటి స్థలంలేని ప్రతి కుటుంబానికి 100 గజాల స్థలం విచ్చేలా పార్లమెంట్లో నా గలాన్ని విప్పుతానని, మీకు సేవకుడిగా ఉంటానని ఖమ్మం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసి తనకు ఓటేయ్యాలని ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా డక్కలి సంఘ రాష్ట్ర నాయకులు కర్ని రామారావు మాట్లాడుతూ.. మమ్మల్ని గుర్తించిన పార్టీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బహుజన మహాసభ నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్, బొడిగె మల్లేష్, మారెళ్ళు దానియేలు తదితరులు పాల్గొన్నారు.