Telugu News

ఎస్ఐ, కానిస్టెబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ : సీఐ సతీష్

అసక్తి కల్గిన వారు దరఖాస్తు చేసుకోండి

0

ఎస్ఐ, కానిస్టెబుల్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ 

అసక్తి కల్గిన వారు దరఖాస్తు చేసుకోండి

— కూసుమంచి సర్కిల్ ఇన్ స్పెక్టర్  సతీష్

(కూసుమంచి-విజయం న్యూస్)

ఎస్ఐ, పోలీస్ కానిస్టెబుళ్ల ఎంపిక కోసం ఎదురు చూస్తున్నారా..? మీరు ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారా..? మీకు మంచి శిక్షణ కావాలనుకుంటున్నారా..?అయితే మేమున్నాం.. మీ నమ్మకానికి మేము భరోసానిస్తాం..అంటూ కూసుమంచి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సతీష్ యువకులకు భరోసానిచ్చారు. కూసుమంచి సర్కిల్ పరిదిలో గల కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలయపాలెం పోలీస్ స్టేషన్ల పరిదిలో గల యువతీ, యువకులకు పోలీసు శాఖ వారి ఆద్వర్యంలో ఖమ్మం పోలీస్ కమీషనర్ శ్రీ విష్ణు ఎస్ వారియర్  ఆదేశాల మేరకు త్వరలో పోలీస్ శాఖలో భర్తీ చేయబోయే ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు అర్హులైన అభ్యర్దులందరికి పోలీసు శాఖ వారి తరుపున దేహధారుడ్య, వ్రాత పరీక్ష ల పైన ఉచితంగా అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తామని తెలిపారు.  కావున ఆసక్తి గల యువతి యువకులందరూ తమ తమ మండల పోలీస్ స్టేషన్ పరిదిలో పేర్లు నమోదు చేయించుకోగలరు.  కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సీఐ సతీష్ తెలిపారు.
also read :- టీవీ చూస్తూ పిల్లలు భోజనం చేస్తే ప్రమాదమే