Telugu News

సిని గాడ్ పాధర్ విశ్వనాథ్ కన్నుమూత

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

0

సిని గాడ్ పాధర్ విశ్వనాథ్ కన్నుమూత

== ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

== తెలుగు సినిపరిశ్రమలో విషాదం

(సినిమా -విజయంన్యూస్)

తెలుగు అగ్రశ్రేణి సినీ దర్శకుడు, సిని దిగ్గజం, గొప్పగొప్ప సినిమాల మాంత్రికుడు కె.విశ్వనాథ్‌  కన్నుమూశారు..  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న విశ్వనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. దీంతో తెలుగు  సినిమానే కాకుండా యావత్తు భారతదేశ సినిపరిశ్రమ విషాదంలో మునిగింది. వేలాధి సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అశ్రునివాళ్ళు అర్పిస్తూ ఆయన్ను స్మరిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సినినటుడు, ఆగ్రహీరో మెగస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలక్రిష్ణ సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకులు అశ్రునివాళ్లు అర్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సీనియర్ నటి జమున కన్నుమూత

ఆయన ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో గొప్పగొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన చేయని సినిమా అంటూ లేదు. ఆయన నటించిన పాత్రంటూ లేదు. ఆయన ఎన్నో గొప్ప కథలను సమాజానికి అందించారు. ఎంతో కొత్త నటులను సినిపరిశ్రమకు పరిశయం చేశారు. సీనియర్లతో పాటు జూనియర్లతో కలిసి నటించారు. ఇప్పటి ఆయన్ను తెలుగు సినిపరిశ్రమకు గాడ్ పాదర్ గా పిలుస్తుంటారు. చాలా మంది ఆయన గురించి గొప్పగా కొనియాడుతున్నారు.  సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడ కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చాన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసకువచ్చారన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఆయన చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయని, విశ్వనాథ్‌ గారి మహాభినిష్క్రమనం తెలుగు సినీరంగానికి తీరని లోటని వారు అన్నారు. విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విజయం తెలుగు దినపత్రిక, విజయం టీవీ కుటుంబమంతా సిని గాడ్ ఫాదర్, కలా తపస్వీ కె.విశ్వనాథ్ కు ఆశ్రునివాళ్లు అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కె.విశ్వనాథ్‌ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి..