Telugu News

త్వరలో ఖమ్మం కు సినీహీరో వెంకటేష్

ఎందుకోసమంటే..,?

0

త్వరలో ఖమ్మం కు సినీహీరో వెంకటేష్

== ఎందుకోసమంటే..,?

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం ఎంపీ అభ్యర్థి   త్రిబుల్ఆర్  విక్టరి కోసం హీరో విక్టరీ వెంకటేష్ ఖమ్మం కు రాబోతున్నారు.. ఇదేంటి.. ఇదీ నిజమా..? అని అంటే నిజమే.. హీరో వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ  తరుపున ప్రచారానికి సిద్దం కావడం..  ఈనెల 7న  ప్రచారానికి ముహూర్తపు డేట్ కూడా ఫిక్స్ అయిoదట…. కాగా… హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఎంపి అభ్యర్థి రామసాహాయం  రఘురాంరెడ్డి ట్రిబుల్ ఆర్ గారిపెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు మరో 10 రోజుల్లో ప్రచార పర్వాలకు తెరపడనుంది! ఈసమయంలో ఆయా అభ్యర్థుల తరుపున పలువురు స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం కోసం బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు వారి వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రచారపనిలో బిజీగా ఉన్నారు. లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విక్టరీకోసం హీరొ విక్టరీ వెంకటేష్ తన ప్రచార ప్రసంగ వాగ్ధాటికి పదును పెడుతున్నారనేది అక్షర సత్యం.. దీంతో కీలకమైన ఖమ్మం లోక్ సభ స్థానంలో పోటీచేస్తున్న అభ్యర్థి విక్టరీ కోసం విక్టరీ వెంకటేష్ ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగబోతుండడంతో ఈవిషయం నెట్టింట వైరల్ గా మారింది…అసలే కాంగ్రెస్ పార్టీ వేవ్ తుఫాన్ వలె వీస్తుంటే.. అందుకు తోడుగా విక్టరీ వెంకటేష్ ప్రచారం అని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియగానే ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది.. వారు కూడా మరో సినీ స్టార్ లతో ప్రచార పర్వాన్ని ప్రారంభించుకుంటారా..? లేక వారే స్వయంగా వారి చేత్తో మైకును పట్టుకుని వారి ప్రసంగాలతో ప్రజలను ప్రసన్నంచేసుకుని ఓటును అభ్యర్ధించుకుంటారా. అనేది వేచి చూడాల్సిందే  మరి..