Telugu News

నగరంలో “మేడిపండు లా”అభివృద్ధి పనులు

-నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానని తునకల మార్చిన టిఆర్ఎస్

0

నగరంలో “మేడిపండు లా”అభివృద్ధి పనులు

-నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానని తునకల మార్చిన టిఆర్ఎస్

-నత్తనడక పనులతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు.

– ప్రచారాల్లో నే అభివృద్ధిని చూపెడుతున్న మంత్రి, మేయర్, అధికారులు.

– మాజీ మేయర్ డి శంకర్

కరీంనగర్ నగర పాలక సంస్థగా ఆవిర్భావించి ఏళ్ళు గడిచిన అభివృద్ధిలో వెనుకబాటు లోనే ఉందని , నగరపాలక సంస్థలో మొదలుపెట్టిన పనులన్నీ అస్తవ్యస్తంగా మందకొడిగా కొనసాగుతున్నాయని, మేడిపండు లా నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు ఉన్నాయని ,నగర అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు చిన్నాభిన్నంగా మారడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ మేయర్ , బిజెపి నేత డి శంకర్ తెలిపారు. కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పనుల జాప్యాన్ని, నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలను నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిబంధనలకు టిఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, ఇష్టానుసారంగా నాణ్యత లేని పనులు చేపడుతూ , పనుల్లో తీవ్ర జాప్యం చేస్తూ కరీంనగర్ పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చారని ఆయన మండిపడ్డారు .

కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 196 కోట్ల నిధులు మంజూరు చేసినా , రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయడంలో మొక్కుబడి వ్యవహారాలు చేస్తుందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా డివిజన్లలో సిసి రోడ్లు వేసేటప్పుడు నియమ నిబంధనలు పాటించాల్సిన కాంట్రాక్టర్లు వాటిని పాటించకపోవడం, అధికారులు మామూళ్ల మత్తులో మునిగి ఆ పనుల మీద పర్యవేక్షణ లేకపోవడం, ఇదే కాకుండా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నత్తనడకన ఏళ్ల తరబడి పనులు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ,బిజెపి కార్పొరేటర్లు మాట్లాడుతూ జిల్లా మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ల మాయమాటలతో ప్రచారం లోనే అభివృద్ధిని చూపెడుతూ నగర ప్రజలను మోసం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు .

టిఆర్ఎస్ పాలకవర్గ తప్పుడు నిర్ణయాలు,హామీలు, ప్రకటనలతో నగర ప్రజలు తీవ్ర అవస్థలకు, ఇబ్బందులు లోనవుతున్నారని, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, రోగులు, పాదచారులు, పిల్లలు కరీంనగర్ రోడ్ల వెంబడి వెళ్లాలంటేనే భయపడుతున్నారని, వాహనదారులైతే ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ పనులంటే ఎంతో నాణ్యత ప్రమాణాలతో చేయాల్సిందిపోయి నాసిరకం పనులు చేస్తున్నారని, దీనికి నగరంలో చేపట్టిన కుంగి ఉన్న ఫూట్ పాత్ లే నిదర్శనమని తెలిపారు. స్మార్ట్ సిటీ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవ్వడం సిగ్గు చేటన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ లో విలినమైన గ్రామాలకు నేటివరకు మున్సిపల్ తాగునీరు పనులు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల డివిజన్లకు నీటి సరఫరా లేక నరకయాతన అనుభవిస్తున్నారని, ఎందుకు మమ్మల్ని కార్పొరేషన్ లో విలీనం చేసినారని ఆయా గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

కరీంనగర్ కార్పొరేషన్ లో సుమారు 3 లక్షల జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేపోవడంతో పారిశుద్ధ్య పనులు అంతంతమాత్రంగానే చేస్తున్నారని, ఈ సమస్యతో ప్రజలు దుర్వాసనకు లోనై ఆనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నాసిరకం పనులతో పూర్తయిన సిసి రోడ్లు, డ్రైనేజీలు కూడా ఎక్కువ కాలం మన్నకుండా తిందరలోనే యాడాది, రెండు ఏళ్ల లోపు పగులుతూ, కూలిపోతూ, కంకర తేలుతున్నాయని దీనికి మంత్రి, మేయర్, అధికారులు కాంట్రాక్టర్లు ముట్టజెప్పే కమిషన్లకు కక్కుర్తి పడడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. అనంతరం కరీంనగర్ నగర సమస్యలపై, తక్షణం నగరపాలక సంస్థ చేపట్టాల్సిన అంశాలను వివరిస్తూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో డి శంకర్ మాజీ మేయర్. తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్.కళ్లెం వాసుదేవ రెడ్డి.గుగ్గిళ్ల రమేష్.రాపర్తి విజయ.దుబాల శ్రీనివాస్.రాపర్తి ప్రసాద్.కొలగని శ్రీనివాస్.పెద్దపల్లి జితేందర్.కాసర్ల ఆనంద్.కచ్చు రవి.బండ సుమ.దురిశెట్టి అనూప్.నగసముద్రం ప్రవీణ్.అవుదుర్తి శ్రీనివాస్. నరహరి లక్ష్మారెడ్డి.పాదం శివరాజ్.ప్రవీణ్ రావు.బొంతుల కళ్యాణ్ చంద్ర,జాన పట్ల స్వామి.సిద్ధి సంపత్.నాంపల్లి శ్రీనివాస్.మామిడి చైతన్య. సోమిడి వేణు,బల్బీర్ సింగ్, కుమార్.లడ్డు ముందడ.సాయి.మహేష్.తిరుపతి.శ్రీనివాస్,కటకం లోకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

also read :-★ నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

 

please subscribe this chanel smiling chaithu