ఆజాద్ పై భట్టి విమ్మర్శల వర్షం
★★ దేశం కోసం పార్టీ మూల సిద్దాంతంతో పని చేస్తున్న వీర వనిత సోనియా
★★ పార్టీ పదవులను అనుభవించి కష్టాల్లో ఉంటే రాళ్ళేసి పోతున్నారు
★★ కాంగ్రెస్ లో వందమంది అజాద్ లను తయారుచేస్తాం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అజాద్ పై సఈఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడ చదవండి:- పునాదుల్లోనే (పురిటి) నొప్పులు…
దేశం విపత్కర పరిస్థితుల్లో ఉంది. రాజ్యాంగ మూల సూత్రాలు, లౌకికవాదం
అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఈ సవాలను నిలువరించి రాజ్యాంగ మూల సూత్రాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది.
అనేక విలువలతో కూడిన దేశ ప్రజాస్వామ్య మూలలను బలోపేతం చేయడమే కాకుండా కుల మతాలకు అతీతంగా జాతి నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
బీజేపీ లాంటి విచ్ఛిన్నకర శక్తులు దేశంలో చిచూపెడుతున్న సమయంలో ఆజాద్ లాంటి అత్యంత అనుభవం గల కాంగ్రెస్ నాయకులు పార్టీ కి రాజీనామ చేయడం బాధకు గురి చేస్తుంది.
ఇటువంటి సమయంలో కాంగ్రెస్ అది నాయకులు గాంధీ నెహ్రు కుటుంబాలకు ఉండి దేశ విచ్ఛిన్నకర శక్తులపై పోరాటం చేయాల్సిన సమయంలో ఆజాద్ ఇలా రాజీనామా లు చేయడం అత్యంత బాధాకరం..
ఇది కూడ చదవండి:- విభజన హామిలు ఏమయ్యాయి ?: నామా నాగేశ్వరరావు
సోనియా గాంధీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దేశం కోసం పార్టీ మూల సిద్దాంతంతో పని చేస్తున్న వీర వనిత, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తన శక్తినంతా ధరపోసి దేశం కోసం, రాజ్యాంగ మూల సూత్రాలకు కాపాడుతూ పని చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ లో సుదీర్ఘ కాలం పని చేసి అనేక ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన ఆజాద్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్షోభకు గురి చేస్తుంది.
ఆజాద్ రాజీనామా సందర్భంగా ఆయన పార్టీ పైన, రాహుల్ గాంధీ పైన లేవనెత్తిన అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నాం…
పార్టీ నుంచి మంచి పదవులను అనుభవించారు. పార్టీ కోసం అనేక కష్టాలు పడ్డారు. గతంలో ఉన్న కష్టాలకంటే ఇప్పుడున్న నష్టాలు పెద్ద కష్టమా..
పోతే పోనీ..పోయేటప్పుడు కాంగ్రెస్ పై విమ్మర్శలు చేయడం అజాద్ రాజకీయ అజ్ఞానాంధకారాన్ని తెలియజేస్తుంది.
ఆయనపోతే పార్టీకీ నష్టం లేదు… ఒక్కరు పోతే వందమంది అజాద్ లను తయార్ చేస్తామని భట్టి ఫైర్ అయ్యారు.