Telugu News

తిరుమలాయపాలెంలో అక్రమ ఇసుక కై ఘర్షణలుః

"మరణాయుధాల"తో దాడులు

0
తిరుమలాయపాలెంలో అక్రమ ఇసుక కై ఘర్షణలుః
== “మరణాయుధాల”తో దాడులు
== తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి
 (తిరుమలాయపాలెం-విజయం న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని ముజాహిద్ పురం గ్రామంలో అక్రమ ఇసుకను తరలించే క్రమంలో ఇసుక ట్రాక్టర్ ఓనర్ల మధ్య గొడవలు,దాడులు జరిగిన సంఘటన తిరుమలాయపాలెం మండలం ముజాహిద్ పురం గ్రామంలో చోటుచేసుకుంది, మరిపెడ మండలం, తానంచర్ల,  మూలమర్రి తండా, గ్రామాల ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ మాఫియాదారులు రాత్రి పగలు వందల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ తిరుమలాయపాలెం మండలం  ముజాహిద్ పురం గ్రామలో వందల సంఖ్యలో డంపింగ్ చేసి ఆ గ్రామ  ట్రాక్టర్ డ్రైవర్లకు విక్రయిస్తున్నారు, ఒక ట్రాక్టర్ ఓనర్ కు మాత్రమే అక్రమ ఇసుక విక్రయిస్తున్నారని ముజాహిద్ పురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్ల మధ్య ఘర్షణలు తలెత్తాయి,  చిలికి చిలికి గాలి వాన అయినట్టు  ఇరువర్గాల మధ్య మాటలు పెరిగి మారణాయుధాలతో దాడి చేసుకోవడంతో ఆ గ్రామానికి చెందిన పుల్లూరు మధు అను వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు,  దీంతో ఆ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని,  ఇసుక మాఫియా ఫై పలుమార్లు వార్త కథనాలు వచ్చిన వారిపై అధికారులు  ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు.  ఈ అక్రమ రవాణలో  అధికార పార్టీకి చెందిన కొందరి హస్తం  ఉందని బాధితుడి బంధువులు అంటున్నారు, తక్షణమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న,  వీరికి అండగా ఉన్నటువంటి కారకులను శిక్షించాలని గ్రామ ప్రజలు అంటున్నారు.