గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన తెలంగాణ సర్కార్ : భట్టి
== అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్రభుత్వంపై ద్వజమెత్తిన భట్టి విక్రమార్క
గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన తెలంగాణ సర్కార్ : భట్టి
== నిధులు ఇవ్వకపోవడంతో కుంటు పడుతున్న అభివృద్ది
== సర్పంచులు అప్పలు చేసి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని సీఎం
== నిధులు సకాలంలో మంజూరు చేయకపోతే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు
== అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్రభుత్వంపై ద్వజమెత్తిన భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్6(విజయంన్యూస్)
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ పంచాయతీల పరిపాలన పూర్తిగా నిర్వీర్యమైందని, నిధులు లేక గ్రామాల్లో అభివద్ది కుంటు పడిపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై ద్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో విలేకర్లతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో చేసిన పనులకు ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను అలా చేస్తున్నాం.. ఇలా చేస్తున్నా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ సర్కార్, ఆ పనులు చేసిన పంచాయతీ సర్పంచులకు ఆరు నెలలైన, ఏళ్లు గడుస్తున్నప్పటికి బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. బిల్లులు పెండింగ్ లు లేవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు అసత్యాలు మట్లాడుతున్నారని, అధికార పార్టీ సర్పంచ్ లు కూడా రోడ్లపైకి వచ్చి ఆవేదన, ఆందోళన తెలుపుతున్నారని గుర్తు చేశారు. సర్పంచుల ఆవేదన ఆందోళన పంచాయతీరాజ్ మంత్రికి కనిపించక పోవడం బాధాకరం. సర్పంచ్ లను హైదరాబాద్ కి రమ్మని పిలిచి మంత్రి ఎందుకు ముఖం చాటేశారని అన్నారు. ఆదాయం పెరగడం కోసం రిజిస్ట్రేషన్ మద్యం పెట్రోల్ డీజిల్ పై అత్యధికంగా పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఎందుకు ఉంది. ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు ఏడాది కావస్తున్నా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనగా రాష్ట్ర ఆదాయం అప్పులు, ఖర్చులు, చెల్లిస్తున్న వడ్డీలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.
వచ్చే 2023- 24 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపనుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, మరో 50 వేల కోట్ల అప్పులకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందన్నారు. అప్పులతో రాష్ట్రాన్ని టిఆర్ఎస్ సర్కార్ అతలాకుతలం చేసిందని ఆరోపించారు. స్థానిక సంస్థలకు పెండింగ్ లో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ప్రజా ప్రతినిధులకు పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఐక్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, పెండింగ్ బిల్లులు సాధనకోసం సర్పంచులు ఆందోళన బాట పట్టాలన్నారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులు వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడుతుంది వారు చేసి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, రాష్ట్ర రాజధానిలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తాజాగా మరో ఇద్దరు బాలికలు లైంగిక దాడికి గురైనట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపిన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని, అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది చూడగలరు: హరితహారం చెట్లు అగ్నికి ఆహుతి…!