Telugu News

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక అజ్ఞానానికి

కాంగ్రెస్ ను చంపడం ఎవరి తరం కాదు

0

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక అజ్ఞానానికి

 

== కాంగ్రెస్ ను చంపడం ఎవరి తరం కాదు

 

== కొండ విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మంప్రతినిధి, జులై 1(విజయంన్యూస్)

కాంగ్రెస్ చచ్చిపోయింది అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్ చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమనికాంగ్రెస్ ను చంపడం ఎవరి తరం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకిక ప్రజాస్వామ్య విలువలతో పాటు సామజిక న్యాయం, సామజిక సంస్కరణలు కోరుకునే పార్టీ అని పేర్కొన్నారు. కొండా తన వ్యక్తిగత ఎజెండా కోసం బిజెపి లో చేరుతున్నాడు..మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ రాజకీయ ప్రయోజనం పొందుతున్న బిజెపి లో చేరడం ద్వారా  కొండా తనలో ఉన్న ఫ్యూడల్ లక్షణాలను బయట పెట్టుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ను చప్పడం ఎవరి తరం కాదని, 2023 లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు.

allso read- కాంగ్రెస్ కన్నెర చేస్తే బీజేపీ ఖతమే : భట్టి

కాంగ్రెస్ వ్యక్తుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ  సిద్ధాంతాలకు విలువ ఇస్తుందని. బలంగా ఉంది కనుకనే  కాంగ్రెస్  సిద్ధాంతాలు నచ్చి  అనేకమంది కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. నిన్నటి దాకా కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను లౌకిక ప్రజాస్వామ్య వాది గా ఫోజు కొట్టాడు ఇవాళ్ళ ఆయన బిజెపి లో చేరి తన నిజస్వరూపాన్ని బయటపెట్టకున్నాడని దుయ్యబట్టారు. ఓట్ల కోసం విభజన రాజకీయాలతో దేశ ప్రజల మధ్య ఉద్రిక్తతలు   సృష్టించడమే కాకుండా అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణితో బిజెపి యేతర ప్రభుత్వాలను కూలుస్తున్న మోడీని   మెచ్చుకోవడం అంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి లో దాగి ఉన్న నియంతృత్వ మనస్తత్వం బయటపడిందన్నారు. TRS ను వీడి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి  చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ కల్పిస్తే తాను గెలవలేక  కాంగ్రెస్ చచ్చిపోయింది అని కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  తన రాజకీయ ప్రత్యర్ధులపైకి సీబీఐ, ఈడి, ఐటిలను ప్రయోగిస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తూ ప్రజల మధ్య విద్వేషాలు స్పృష్టిస్తూ  దేశ ప్రగతికి విఘాతం కలిగిస్తున్న ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల వెలుగులో పనిచేసే బిజెపి రాజకీయాలు కొండాకు నచ్చాయంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజావ్యతిరేక భావజాలం ఉన్నవాడు కనుక కొండాకు బిజెపి సిద్దాంతాలే నచ్చుతాయన్నారు.

allso read- ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య…!