Telugu News

మధిరలోని బడ్డికొట్ల తొలగింపుకు బ్రేకులు వేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పాదయాత్రలోనే కలెక్టర్ తో పోన్లో మాట్లాడిన భట్టి

0

మధిరలోని బడ్డికొట్ల తొలగింపుకు బ్రేకులు వేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== పాదయాత్రలో భట్టికి వినతిపత్రాన్ని అందించిన టీడీపీ,సీపీఎం,సీపీఐ, కాంగ్రెస్ నాయకులు

== పాదయాత్రలోనే కలెక్టర్ తో పోన్లో మాట్లాడిన భట్టి

(మధిర/ఖమ్మం-విజయంన్యూస్)

మధిర పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్నచిరు వ్యాపారుల బడ్డీకొట్లు అధికారులు తొలగించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మధిర పట్టణంలోని రోడ్డుకు ఇరువైపుల చిరువ్యాపారుల బడ్డీ కొట్లు తొలగిస్తున్నారని,  వారి బతుకు తెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి శుక్రవారం ముదిగొండ మండలం అమ్మ పేటలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం, సిపిఎం మధిర పట్టణ అధ్యక్షులు తేలప్రోలు రాధాకృష్ణ, సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబు, టిడిపి మధిర అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, కాంగ్రెస్ మధిర పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ, ఐఎన్టీయుసి మధిర పట్టణ అధ్యక్షులు కోరంపల్లి చంటిలు వినతిపత్రం అందజేశారు.

allso read : షూరు అయిన భట్టి పాదయాత్ర

దీంతో స్పందించిన ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి కార్యక్రమం నుంచే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి  బడ్డీ కొట్లు సమస్య గురించి చర్చించారు. చిరు వ్యాపారులకు మరో చోట ప్రత్యామ్నాయం కల్పించే వరకు ఇప్పుడు ఉన్న చోటనే బడ్డీకొట్లు నడిపించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భట్టి విక్రమార్క ఫోన్ లో కలెక్టర్ తో మాట్లాడటంతో కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఏర్పాట్లు చేస్తానని హామినిచ్చారు.  ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే రోడ్డు పక్కన ఉన్న బడ్డీకొట్లు తొలగించేందుకు కలెక్టర్ అంగీకరించారు. దీంతో వినతి పత్రాన్న అందించేందుకు వచ్చిన నాయకులు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

== సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో  కాంగ్రెస్ లో చేరికలు

ముదిగొండ మండలం వల్లాపురంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భట్టి విక్రమార్క కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గాలి సత్యనారాయణ, గాలి శీను ,గాలి లక్ష్మీనారాయణ, ఆరుద్ర సీతయ్య, గాలి ఆకేష్, వజీర్, శ్రీలక్ష్మి అమీర్, గుత్తికొండ నాగయ్య ,గోపి నేని శ్రీను, నరేష్ తదితరులు ఉన్నారు.

== సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు టిడిపి, సిపిఐ, సిపిఎం నేతలు సంఘీభావం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క  చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాధం, సిపిఎం మధిర పట్టణ కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, సిపిఐ నాయకులు బెజవాడ రవిబాబు, టిడిపి మధిర అధ్యక్షులు మల్లాది హనుమంతరావు,  సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం *ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని కలిసి తమ మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని టిడిపి కార్యకర్తలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.