Telugu News

షూరు అయిన భట్టి పాదయాత్ర

పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం,  కదం తొక్కిన పల్లేలు

0

షూరు అయిన భట్టి పాదయాత్ర

** ముదిగొండ మండలం అమ్మపేట నుంచి ప్రారంభం

** ఆలయంలో పూజలు చేసిన భట్టి దంపతులు

** పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం,  కదం తొక్కిన పల్లేలు

** విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

** ధనిక రాష్ట్రాన్ని దివాళ తీయించింది టిఆర్ఎస్ సర్కార్

** పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) తో రాష్ట్ర సర్కారులో కదలిక

** ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

** ప్రజలకు అభయాస్తమిచ్చేది కాంగ్రెస్

** ప్రజలను అందినకాడికి దోచుకునేది  టీఆర్ఎస్

** మాయమాటలకు కాలం చెల్లింది

** పాదయాత్రలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ద్వజమెత్తిన భట్టి విక్రమార్క

(ముదిగొండ/ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యుడు భట్టి విక్రమార్క ప్రజల కోసం, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన పిపుల్స్ మార్చ్(పాదయాత్ర) శుక్రవారం పున: ప్రారంభమైంది. పిబ్రవరి 27న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో శ్రీలక్ష్మినర్సింహస్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం ప్రారంభించిన పాదయాత్ర ఆరు రోజుల పాటు కొనసాగింది. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో 5న తాత్కాలికంగా వాయిద పడిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలు అనంతరం తిరిగి 25న ప్రారంభమైంది. ముదిగొండ మండలంలోని అమ్మపేట గ్రామంలో వెలిగొండస్వామిదేవాలయంలో భట్టి విక్రమార్క, నందిని దంపతులు పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు.

లక్ష్మీదేవిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి.         

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం దేవాలయం నుంచి అమ్మపేట, వల్లాపురం, మీదుగా చింతకాని మండలం నామవరం, మత్కేపల్లి, జగన్నాధపురం గ్రామాల్లో కొనసాగింది. రాత్రికి జగన్నాధపురంలో  బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు.

== అడుగడుగున నిరాజనం..

సీఎల్పీనేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగున నిరాజనం పలికారు. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో పాదయాత్రజనసందోహమైంది. గ్రామాల్లోని తమ వీధుల్లోకి అడుగు పెట్టిన భట్టి విక్రమార్కకు మహిళలు తిలకం దిద్ది, హారతులు పట్టి స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క, నందిని దంపతులను ఆశీర్వదించారు. అలాగే కార్యకర్తలు, నాయకులు పూలవర్షం కురిపించారు. ఎక్కడ చూసిన జన నీరాజనమే.                           25న భట్టి పాదయాత్ర

 

== అప్యాయతగా పలకరిస్తూ 

భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజలందర్ని కలిసి మాట్లాడుతూ ముందుకు సాగారు. ప్రతి ఒక్కర్ని అప్యాయతగా పలకరిస్తూ, పేరు పెట్టి పిలుస్తు, వారి ఆరోగ్య పరిస్థితులను, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వివిధ గ్రామాల్లో పాఠశాలల వద్దకు వచ్చిన ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. వారి సమస్యలను భట్టి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను

ఆశీర్వదించారు. పాఠశాలలను అభివద్ది చేస్తానని హామినిచ్చారు. అలాగే మార్గమద్యలో కలుస్తున్న కూలీలతో భట్టి విక్రమార్క మాట్లాడారు. వారి కూలీ ఎంతోస్తుంది. ఎలా కుటుంబానికి సరిపోతుంది.. పింఛన్లు వస్తున్నాయా..? ఇండ్లు వచ్చాయా..? అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క అందర్ని పలకరిస్తూ ముందుకు సాగారు.

== తెలంగాణనే దివాళ తీయించిన సర్కార్ అవసరమా..?

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం ప్లస్ లో ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ఆదాయంలో ఉన్న తెలంగాణను  దివాళ తీయించారని, ప్రస్తుతం లక్షల కోట్ల అప్పుల తెలంగాణ మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం వల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. దేశానికి అచ్చే దిన్ తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తూ,  డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలకు చచ్చే దీన్ తీసుకు వచ్చాడని ధ్వజ మెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్ల దేశంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కిలో మంచి నూనె ప్యాకెట్ ధర రూ. 220 ఎగబాకితే పేదలు బతికేది ఎట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోజువారి వచ్చే కూలీ డబ్బులు నూనె కొనడానికే సరిపోతే కూలీలు ఎట్లా మూడు పూటలు తింటారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా దండుకొంటుందని, ఆ డబ్బునంతా సీఎం కేసీఆర్ కుటుంబం ఇతర దేశ బ్యాంకుల్లో దాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ డబ్బులు బయటకు వస్తాయన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎన్నికలకు ఉపయోగించుకుని పబ్బం గడుపుతున్నారని, ఆ విషయాన్ని ప్రజలందరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రజలను దోచుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమైతే, ప్రజలను అదుకుంటూ అభయాస్తం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. ప్రజలను దోచుకునే ప్రభుత్వం మనకు అవసరమా..? అని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వం సంగతేందో చూడటం కోసమే ప్రజల తరుపున పాదయాత్ర చేస్తున్నానని అన్నారు.

== పీపుల్స్ మార్చి పోరాట ఫలితమే…

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన పీపుల్స్ మార్చ్ లో వచ్చిన ప్రజా సమస్యలను ప్రజల గొంతుక అసెంబ్లీలో ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వివరించారు. నకిలీ విత్తనాలతో పొద్దుతిరుగుడు, మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ వేదికగా గళం వినిపించడంతో సీఎం కేసీఆర్ స్పందించి నకిలీ విత్తనాల విక్రయాలపై ఫోకస్ పెట్టి అక్రమార్కులపై పిడియాక్ట్ కేసులు పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రిని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. పంట నష్టం పరిహారం అంచనా వేయడానికి అధికారులను వ్యవసాయ క్షేత్రాలకు పంపించడానికి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్,  నగర అధ్యక్షుడు ఎండీ.జావిద్, జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, వెంకయ్య, పాదయాత్ర కోఆర్డీనేటర్ బుల్లేట్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డుబొందయ్య, పుచ్చకాయల వీరభద్రం, మొక్కాశేఖర్, దొబ్బల సౌజన్య, యడ్లపల్లి సంతోష్, నాయకులు పెండ్ర అంజయ్య, అజయ్ బాబు, వనంబాబు, రాందాసు నాయక్, కొత్తసీతారాములు, వైరా, మధిర, ఎర్రుపాలెం మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, సూరంశెట్టి కిషోర్, సుధాకర్ రెడ్డి, జెర్రిపోతుల అంజని, బచ్చలకూర నాగరాజు, నాగరాజు,  నాయకులు తదితరులు హాజరైయ్యారు.