Telugu News

రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం

రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు

0

రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం

== రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు

== పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్రవాగ్వివాదం

== పోలీసులపై సీఎల్పీ ఆగ్రహం

భద్రాచలం, ఆగస్టు 16(విజయంన్యూస్)

దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న తెలంగాణ సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవలే వచ్చిన గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను, ప్రజలను పరామర్శించేందుకు సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుగ్గిళ్ల శ్రీధర్ బాబు, పోడేం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయా జిల్లాల నాయకులు పర్యటనకు వెళ్తుండగా, భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ వద్ద అడ్డుకున్నారు. దుమ్ముగూడెం మరో 8కిలోమీటర్ల దూరం ఉంటుందనగా పోలీసులు వారి పర్యటనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

== ప్రాజెక్టు సందర్శన అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ….

దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. దుమ్ముగూడెం సందర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏసీపీ రోహిత్ ఎమ్మెల్యేలకు చెప్పడంతో ప్రభుత్వ వైఖరి తీరును ఎండగడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ఎందుకు వెళ్ళనివ్వరని ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న రహస్యం ఏందని నిలదీశారు. కచ్చితంగా దుమ్ముగూడెం వెళ్తామని భీష్మించడంతో పోలీసులు భారీగా మోహరించి అటువైపుగా వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు ప్రభుత్వానికి కేసీఆర్ కు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి తలెత్తింది

allso read- టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య..ఎందుకోసమంటే..?