అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి
== పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
== 48 గంటల పాటు భట్టి విక్రమార్కకు పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని చెప్పిన డాక్టర్లు
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు పీపుల్స్ మార్క్స్ పాదయాత్ర 60 రోజులుగా కొనసాగుతుండగా గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత అధికమైన సందర్భంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు ఎండ ప్రభావం వలన అస్వస్థత గురైనట్టుగా వైద్యులు తెలిపారు..
ఇది కూడా చదవండి:- బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు: భట్టి
నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థకు గురైన భట్టి విక్రమార్క. డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ వచ్చి భట్టి విక్రమార్క ఆరోగ్యన్నీ పరీక్షించి.. షుగర్ లెవెల్స్ తగ్గాయని చెప్పారు. ఎండలకు వందల కిలోమీటర్లు దూరం నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని చెప్పారు. తీవ్రమైన ఎండలకి వందల కిలోమీటర్లు నడవడం వల్ల.. వడ దెబ్బ, డీ హైడ్రేషన్ కు భట్టి విక్రమార్క గురయ్యారాని డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ధ్రువీకరించారు.
ఇది కూడా చదవండి:- సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి
ఈ నేపథ్యంలో 48 గంటల పాటు భట్టి విక్రమార్కకు పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని చెప్పారు. ఈ రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరం అని సూచించారు. డాక్టర్ గారి సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. రేపు, ఎల్లుండి (19, 20 తేదీల్లో) పాదయాత్రకు విరామం ప్రకటించడం జరిగింది.