Telugu News

*కోలుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క*

కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కొనసాగుతున్న ట్రీట్మెంట్*

0

*కోలుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క*

*కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కొనసాగుతున్న ట్రీట్మెంట్*

*తగ్గిన జ్వరము, తగ్గిన నీరసం*.
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురి కాగా ఆయన కోలుకుంటున్నారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరం ఉండటంతో ఆయనకు సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా జ్వరం రావడంతో పాటు బాడీ డిహైడ్రేషన్ కావడం వల్ల సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి చాలా నీరసంగా ఉందని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:- భట్టి విక్రమార్క అభిమన్యుడు కాదు అర్జునుడు

జ్వరము, నీరసం తగ్గడానికి చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. బాడీ డిహైడ్రేషన్ కావడం వల్ల త్వరగా కోలుకోవడానికి సెలైన్స్ పెట్టినట్లు వెల్లడించారు. గురువారం భట్టి విక్రమార్క కొంతమేరకు కోలుకున్నారు. జ్వరం తగ్గినప్పటికీ నిరసంగా ఉందని, ఇంకా కొంత రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. కాగా గురైన విషయం తెలుసుకున్న ఖమ్మం ఉమ్మడి జిల్లా నల్లగొండ ఉమ్మడి జిల్లా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆయన అభిమానులు తరలివచ్చి పరామర్శిస్తున్నారు.
100 డిగ్రీల జ్వరంలోనూ నీరసంగా ఉన్నప్పటికీ బట్టి విక్రమార్క తనను చూడడానికి పరామర్శించడానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులను కలిసి ఏలాంటి దిగులు, ఆందోళన చెందవద్దని, తాను త్వరలోనే కోలుకుంటానని వారికి ధైర్యం చెప్పి పంపారు.

ఇది కూడా చదవండి:- పొంగులేటిని కలిసిన రేవంత్ రెడ్డి