Telugu News

సీఏల్పీ నేత భట్టి విక్రమార్క చిట్ చాట్.. .

0

సీఏల్పీ నేత భట్టి విక్రమార్క చిట్ చాట్..

(విజయం న్యూస్):-

అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి ని పదే పదే కాంట్రాక్టర్ అని టిఆర్ఎస్ శాసనసభ్యులు/మంత్రులు సంబోధించడం సరికాదు..

సభ్యులు చాలా మంది కి చాలా బిజినెస్ లు ఉంటాయి.. అలాగని వారి వృత్తి గురించి ఎలా మాట్లాడుతాం..

ఎవరైనా గౌరవ సభ్యులు అని మాట్లాడాల్సిందే..

స్పీకర్ కూడా నేను కాంట్రాక్టర్ అని చెప్పాడు..అలాగని కాంట్రాక్టర్ అని సభాపతిని పిలవలేము కదా..

రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు అధికార పార్టీ నేతల తీరు చూస్తే..కౌరవ సభలా అనిపించింది.

also read;-బాహుబలి`3 కోసం కసరత్తులు

ఉద్దేశ్య పూర్వకంగానే రాజగోపాల్ రెడ్డిని పదే పదే రెచ్చగొట్టారు.

సాగునీటి ప్రాజెక్టు లెక్కలు చెప్పకుండా , అవినీతి గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడకుండ అధికార పార్టీ నేతలు సభ ను డైవర్ట్ చేశారు.

సభలో మంత్రులు గౌరవ సభ్యలుగా సంబోదించాలి. కాంట్రాక్టర్ అనడం సరైంది కాదు. సభ సంప్రదాయానికి విరుద్ధం.