Telugu News

రైతు,నిరుద్యోగ సమస్యలపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర

రైతు,నిరుద్యోగ సమస్యలపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర

0

రైతు,నిరుద్యోగ సమస్యలపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పాదయాత్ర
 జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమీక్ష సమావేశంలో మల్లు నందినివిక్రమార్క
(ఖమ్మం-విజయంన్యూస్);-
జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినెటర్ యాసిన్ ఆధ్వర్యంలో జిల్లా లో వివిధ మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్ల విధుల నిర్వహణ,ప్రచార కార్యక్రమాల పై స్థానిక ప్రజా భవన్ నందు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కమరియు అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ మల్లు నందిని విక్రమార్క హాజరై మాట్లాడరూ.ఈనెల 9వ తేదీన దగా పడ్డరైతుల కొరకు,మోసపోయిన నిరుద్యోగ యువత కోసం భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని,దీనికి యువత ముందు ఉండి నడవాలని, గ్రామంలో నుంచి ప్రతి రైతు మేల్కొని కె.సి.ఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలని ఎరువులపై ,నిత్యవసర ధరలుపెరుగుదల,రైతు బందు పథకాలు పెట్టి ఒక దోపిడి మాఫియాకి తెరలేపారని, కె.సి.ఆర్ కౌలు రైతులను గుర్తించడంలేదని,

also read;-ఐటీలో ఖమ్మం మేటి.. ఐటీ మంత్రి కేటీఆర్

మిర్చి తోట కు ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక వైపు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ మాత్రం ఏమి పట్టనట్లు ఫార్మహౌస్లో ప్రశాంతంగా మొద్దు నిద్రపోతున్నాడని ఆమె ఎద్దేవా చేశారు.కె.సి.ఆర్ దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలని యువతకు పలు సూచనలు చేశారు.అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా లోని పలు మండలాల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు చిలకల రామకృష్ణ, వేలాద్రి, కరాటే నవీన్, అబ్దుల్ సమద్, సంతోష్, ఉపేందర్, హరి, అనిల్ కుమార్, సాయి చైతన్య తదితరులు పాల్గొన్నారు