Telugu News

చిరు వ్యాపారులతో సీఎల్పీ నేత మాటముచ్చట

చెప్పులుకుడుతున్న రవిని, టీ స్టాల్ వద్ద చిరువ్యాపారులను కలిసిన భట్టి

0

చిరు వ్యాపారులతో సీఎల్పీ నేత మాటముచ్చట

== చెప్పులుకుడుతున్న రవిని, టీ స్టాల్ వద్ద చిరువ్యాపారులను కలిసిన భట్టి

(ఖమ్మం(మధిర)-విజయంన్యూస్)

సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ శాసనసభ్యుడు భట్టి విక్రమార్క శనివారం మధిర నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న సందర్భంలో మధిర నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చెప్పులు కుడుతున్న పగిడిపల్లి రవి అనే చర్మకారుడు వద్దకు స్వయంగా వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆయన వ్యాపార కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత వస్తున్నాయి, ఆ డబ్బులతో కుటుంబం వెళ్తుందా..? ఎంత మంది పిల్లలు, వారు ఎలా ఉన్నారు..? ఎక్కడున్నారని అప్యాయతంగా మాట్లాడుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అవకాశం వస్తే కచ్చితంగా అదుకుంటానని హామినిచ్చారు. అనంతరం  క్లబ్ సెంటర్లో కొండ టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ స్టాల్ యజమానిని పలకరించారు. ఆయనతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం ఎలా నడుస్తుందని, ఎంత వస్తున్నాయని, ఆ డబ్బులతో కుటుంబం ఎలా వెళ్లదిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీ స్టాల్ యజమాని ఇచ్చిన టీని తాగారు.

allso read- కోమటిరెడ్డి లేకుండానే..? అందులో నోచాన్స్