*సీఎల్పీ నేత భట్టిని కలిసిన మంద కృష్ణ
*సీఎల్పీ కార్యాలయంలో మల్లు భట్టివిక్రమార్క కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు*
*సీఎల్పీ నేతను భారీ గజమాలతో సత్కరించిన కానిస్టేబుల్ అభ్యర్థులు*
(హైదరాబాద్ -విజయంన్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరన ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.
Allso read:-పాలేరు నియోజకవర్గానికి శుభవార్త
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తానని సీఎంతో సానుకూలంగా ప్రకటన చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సీఎల్పీ నేత భట్టిని సన్మానించారు.
Allso read:- గోదావరి ఉగ్రరూపం