పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేపించడం లో ఎంపీ నామ కృషి మరువలేనిది
▪️ పేదలకు అండగా నిలుస్తున్న సీఎం సహాయ నిధి
పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేపించడం లో ఎంపీ నామ కృషి మరువలేనిది
▪️ పేదలకు అండగా నిలుస్తున్న సీఎం సహాయ నిధి
▪️ రాష్ట్ర రైతాంగం కోసం ఢిల్లీలో ఎంపీ నామ పోరాటం జిల్లా ప్రజలకు గర్వకారణం
▪️ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు రూ.23,23500/- లక్షల రూపాయల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం మంజూరు చేపించడం లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, TRS లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కృషి మరువలేనిదని డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం,రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి పేర్కొన్నారు.. మంగళవారం నాడు ఖమ్మం లోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, మణుగూరు, దోర్నాకల్, కోదాడ కి చెందిన 32 మంది లబ్ధిదారులకు సుమారు రూ.23.23500/- లక్షల రూపాయల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు..
అనంతరం వారు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్దిక చేయూత ఇవ్వాలి వైద్యం వారికి భారం కాకూడదు అనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయ నిధి నుండి వైద్య సేవలు పొంది దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్దిక సహాయం అందిస్తున్నారని గుర్తు చేశారు. ఖమ్మం లోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి మంజూరు చేపించడం కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి నామ నాగేశ్వరరావు ప్రత్యేకంగా చొరవ తీసుకుని చెక్కులు మంజూరు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు…
ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు ఢిల్లీలో పార్లమెంట్ లోపల, బయట ఎంపీ నామ నాగేశ్వరరావు తన గళాన్ని గట్టిగా వినిపిస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం చేస్తున్న పోరాటం ఉమ్మడి జిల్లా ప్రజలకు గర్వకారణంగా ఉందని వారు స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ, నాయకులు ఎన్నబోయిన రమేష్ ,చిత్తారు సింహాద్రి యాదవ్, భూపతి శ్రీనివాసరావు,కోటిరెడ్డి, జానీబాబా,తన్నీరు రవికుమార్, వాకాదని కోటేశ్వరరావు, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
also read ;-చెట్లను మింగేస్తున్న కలప తిమింగళాలు…?