కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం చాటుకున్న విలక్షణ నటుడు అన్న సీఎం
కృష్ణంరాజు మరణం పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
** సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం చాటుకున్న విలక్షణ నటుడు అన్న సీఎం
(హైదరాబాద్-విజయం న్యూస్)
దిగ్గజనటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. 50 ఏండ్ల సినీప్రస్థానంలో తన విలక్షణ నటనాశైలితో రెబల్‌స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా రాజకీయ పాలనారంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు.
Allso read:- కృష్ణంరాజు మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Allso read:- రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…