Telugu News

భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి 

ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు..

0

భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ : మంత్రి 

== సీఎం కేసిఆర్ కొత్తగూడెం జిల్లా పర్యటన విజయవంతం
== భద్రాద్రిరామయ్యతోనే సీఎం కేసీఆర్ అంటూ మరోమారు నిరూపితం అయ్యింది.

== జిల్లా ప్రజల ఆదరణ, అభిమానం మరువలేనిది.

== ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు..

== రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

భద్రాద్రికి తోడుగా సీఎం కేసీఆర్ ఉంటున్నారని, భద్రాద్రి అభివృద్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మరోసారి నిరూపితమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన విజయవంతం కావడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: అందరి చూపు ఆయన వైపే

భద్రాద్రి కొత్తగూడెం గడ్డ ప్రజలు కేసిఆర్ గారికి మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటామనే సంకేతాన్ని కల్పించినందుకు జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు మరోమారు నిరూపితం చేశారని పేర్కొన్నారు. రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసిఆర్ వెంటే మేమంతా అని చాటి చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి లాగే భారత దేశ బాగు కోసం కేసిఆర్ గారు దేశ రాజకీయాలకు నాయకత్వం వహించాలని రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ముక్తకంఠంతో కోరుకోవడం కేసిఆర్ సైనికుడిగా తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్  తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తగా నిలిచి కోట్ల గుండెలను కదిలించి ఉద్యమ కెరటంగా నిలిచిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ.. దేశ రాజకీయాలకు జిల్లా ప్రజల మద్దతును కోరడం, ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవ్వడం ఎంతో శుభపరిణామం అన్నారు.

ఇది కూడా చదవండి: తుమ్మలతో దోస్తి..

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరెన్ని చెప్పినా.. అభివృద్ది వెంటే మేము అని చేతులు కలిపి కేసీఅర్ గారి పర్యటనను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు మంత్రి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.అట్లాగే సీఎం  పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎర్పాటు చేసిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పలువురు ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి ఊహించని షాక్..?