Telugu News

సిఎం కేసీఅర్ పుట్టిన రోజువేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు..

ఖమ్మం విజయం న్యూస్

0

***రెండవరోజు అదే జోరు..సిఎం కేసీఅర్ పుట్టిన రోజువేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు..

***(ఖమ్మం విజయం న్యూస్);-

తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవ వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరక రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో మేయర్ పునుకోల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా , సుడా ఛైర్మెన్ బచ్చు విజయ్  AMC చైర్మన్ లక్ష్మీప్రసన్న  మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ  నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు  మంత్రి పీఏ CH. రవికిరణ్  అధ్వర్యంలోఖమ్మం నియోజకవర్గంలో రెండవ రోజు సంబరాలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

also read :-**కాంగ్రెస్ నేతలు రేవంత్, కొమటిరెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు

ఖమ్మం నగరం 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మక్బుల్ అద్వర్యంలో దుర్గాభవాని వృద్ధా ఆశ్రమంలో వృద్దులకు పండ్లు మరియు బ్రేడ్స్ పంపిణి చేశారు.- 17వ డివిజన్ కార్పొరేటర్ దనాల రాధ అధ్వర్యంలో శ్రీనివాసనగర్ నందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్, బ్రేడ్, పెన్స్ ను పంపిణీ చేశారు.

– యూవజన విభాగం ఆధ్వర్యంలో VDO’s కాలనీలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం నందు యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు