Telugu News

51మందికి బీఫామ్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్

సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు

0

51మందికి బీఫామ్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్

== సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు

(హైదరాబాద్ -విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆదివారం సీఎం కేసీఆర్ బీఫామ్స్ ఇచ్చారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 115మంది  అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించగా అందులో 51మంది అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కీలక అంశాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం పై సీఎం కేసీఆర్ గురి

నామినేషన్లకు ఇంకా సమయం ఉందని, హైరానా పడోద్దని సూచించారు.ముందుగానే బీ ఫామ్ ఇస్తున్నామని, జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపాలని సూచించారు.చివరి రోజు వరకు సమయం ఉందని, ఆగమాగం అవోద్దని పిలుపునిచ్చారు. చివరి రోజే అందరూ వేయాలని ఇబ్బంది పడకండి, బీ ఫామ్స్ తప్పుగా నింపకండని సూచించారు. టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని, ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తో పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారనే విషయం మరవోద్దని సూచించారు. అలాంటి విషయాల్లో అజాగ్రత్త ఉండోద్దన్నారు.

ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

న్యాయ కోవిదులు ఉన్నారని, అంత మాకే తెలుసు అనుకోకండని, కచ్చితంగా వారిని సంప్రదించాలన్నారు. ఎన్నికకు ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయన్నారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందని, అప్డేట్ ఓటర్ లిస్ట్ వచ్చిందని సూచించారు. ఇవాళ రేపు కూడా బీ ఫామ్ ఇస్తామని, ఇవాళ 51 మందికి బీ ఫామ్ ఇస్తానని హామినిచ్చారు.