Telugu News

నవ భారతానికి సీఎం కేసిఆర్ మార్గదర్శి : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి

0

నవ భారతానికి సీఎం కేసిఆర్ మార్గదర్శి : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి

ప్రతిపక్షాలు తీరుపై ధ్వజమెత్తిన మంత్రి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-
రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూ సీఎం కేసిఆర్ నేతృత్వంలో మహిళ సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో అనేక పథకాలు అమలు చేస్తూ నవ భారతానికి కేసిఆర్ మార్గదర్శిగా ప్రశంసలు పొందుతున్నారని మంత్రి అజయ్ పేర్కొన్నారు.

also read;-తెలంగాణ ప్రజల ఆత్మబంధువు కేసిఆర్ : మంత్రి అజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కంగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇచ్చిన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం నగరంలో ఘనంగా జరిగిన సంబరాలలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగుతున్నదని మంత్రి అన్నారు. మహిళల ఉన్నతికి సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తాగునీటి కోసం మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ భరోసా కేంద్రాలు, షీ టీంలు వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో 10.27 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, 10 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందాయని చెప్పారు. సర్కారు దవాఖానాల్లో 32 శాతం ప్రసవాలు గతంలో ఉంటే నేడు 52 శాతానికి పెంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి అజయ్ వివరించారు.

also read;-ఖమ్మంలో తెరాస లీగల్ సెల్ లోకి భారీగా చేరికలు..

సీఎం కేసిఆర్ ముందుచూపు ఉన్న నాయకుడని, ఆయన ప్రధాని అవుతారనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఏడేండ్లలోనే ప్రజా సంక్షేమ పథకాలు, వినూత్న ఆలోచనలతో తెలంగాణ అన్ని రాష్ర్టాలకూ దిక్సూచిగా మారిందని అన్నారు. ఏదో ఒక సంక్షేమ పథకం అందని ఇల్లు, లబ్ధిదారు లేని ఊరు తెలంగాణలో లేదన్నారు. తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, జాతీయ రాజకీయాలలో కేసిఆర్ కేంద్ర బిందువువని మంత్రి అజయ్ చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నాలుకకు నరం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్‌, పింఛన్లు వంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. అభివృద్ధి చేయడం చేతగాక, చేస్తున్న వారిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ నాయకులు కోర్టులో కేసులు వేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బు పెట్టి కొన్న పదవిలో ఒకరు, దిక్కు లేక పెట్టిన పదవిలో ఉన్న మరొకరు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

ఏడు దశాబ్దాలపాటు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో పాతికేండ్లు సీఎంగా ఉన్న మోదీ ఏం అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణ మోడల్ పథకాలు ఉన్నాయా అని నిలదీశారు. డబ్బుతో పార్టీ పదవులు కొనుక్కున్న నాయకులు, ప్రజల్లో చెల్లుబాటు కాని నేతలు సీఎం కేసీఆర్‌పై నోరుపారేసుకుంటే తగిన రీతిలో తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు