Telugu News

సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి: మంత్రి పువ్వాడ

అర్హులైన లబ్దిదారులకు పట్టాలను పంపిణి చేసిన మంత్రి పువ్వాడ

0

సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి: మంత్రి పువ్వాడ

== పేదల కల సాకారం చేసే ఆపద్భాంధవుడు

== అర్హులైన లబ్దిదారులకు పట్టాలను పంపిణి చేసిన మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి అని, పేదల కల సాకారం చేసే ఆపద్బాంధవుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని 58 జీవో నెం.58, 59 పట్టాలు, మరియు 4, 5, 6, 7, 8, 9, 10, 14, 16, 22, 26, 31, 32, 36, 37, 39, 40, 41, 50, 58వ డివిజన్ లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకం కింద మంజూరైన మంజూరు పత్రాలను మంత్రి పువ్వాడ అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల నాటి పేదల కలలను జీవో 58, 59ల ద్వారా సీఎం కేసీఆర్‌ సాకారం చేశారని, పేదలకు స్థలాలు క్రమబద్ధీకరణ చేయడం గొప్ప విషయమని చెప్పారు. పేదలకు పట్టాలు ఇవ్వడంతో వారిలో ధైర్యం పెరిగిందన్నారు. దీంతో పాటు సొంత జాగా ఉన్న పేదలకు గృహలక్ష్మి పథకంతో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారు చెప్పారు.

ఇదికూడా చదవండి: నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఆ స్థలం వారికే చెందే విధంగా ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు.  జివో నెం.58 ద్వారా ప్రజల నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు అందజేశామని, జీవో.నెం.59 లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన నామ మాత్రపు ఫీజును తీసుకుని వారి పట్టాలు అందిస్తునన్నామన్నరు. పేదల కోసం ఇలాంటి మహత్తర కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం కు మీరంతా రుణపడి ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ను కాపాడుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మయర్ పునుకొల్లు నీరజ, డెప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, జిల్లా కలెక్టర్ వీ.పి. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్,  ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డెప్యూటీ మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి, ఆర్డీవో గణేశ్, తహసిల్దార్ స్వామి, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: అభివృద్ధిలో మాకు మేమే చాటి: మంత్రి పువ్వాడ