Telugu News

సీఎం కేసీఆర్ ను కలిసి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు

ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులను అభినందించిన సీఎం

0

సీఎం కేసీఆర్ ను కలిసి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు

** ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులను అభినందించిన సీఎం

** పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించిన సీఎం కేసీఆర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా తాతామధు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.  కాగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు ఉమ్మడిగా కృషి చేసిన ప్రజా ప్రతినిధులందరినీ ముఖ్యమంత్రి అభినందించారు. ఇలాగే కష్టపడి పనిచేసి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని, ఇంటింటికి టీఆర్ఎస్ జెండా ఎగరవేసే విధంగా కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

ALLSO READ :- కేంద్రంపై యుద్దం ప్రకటించిన సీఎం కేసీఆర్

పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో నూటికి నూరుశాతం అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  గెలిపించిన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అందరికి అందుతున్నాయా..? లేదా పరిశీలించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికి అందే విధంగా చూడాలని ఆదేశించారు. ఎదైనా సమస్య ఉంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు తెలియజేయాలని, తక్షణమే పనులు పూర్తి అయ్యే విధంగా పనిచేస్తానని హామినిచ్చారు. జీల్లా అభివఈద్ది కోసం తనవంతుగా పనిచేస్తానని హామినిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.