Telugu News

సీఎం కేసీఆర్ మాయలమరాఠి : పొంగులేటి

సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన పొంగులేటి

0

సీఎం కేసీఆర్ మాయలమరాఠి : పొంగులేటి

== ఆయన నమ్మదగ్గ వ్యక్తి కాదు

== సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన పొంగులేటి

(సత్తుపల్లి-విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ మాయల మారాఠి, ఆయన మాటలు కోటలు దాటతాయి.. చెప్పిన పని ఏ ఒక్కటి అమలు కాదు.. జనం కోసం కాకుండా ఆయన కోసం పథకాలు తీసుకోస్తారు.. ఆయన నమ్మదగిన వ్యక్తి కాదంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సత్తుపల్లిలో ఆ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ సమ్మెళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటువ్యాఖ్యలు చేశారు. గడిచిన 9ఏళ్లలో సీఎం కేసీఆర్ ఎన్నికల కంటే ముందు చెప్పిన ఏ ఒక్క హామినైన అమలు చేశారా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడేకరాలు, దళిత బందు, రైతు బంధు లాంటి పథకాలను తుంగలో తొక్కేశారని ఆరోపించారు. రుణమాఫీ ఇస్తానని నమ్మబలికి ఓట్లేయించుకున్న సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 3లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఇంతటి మాయల మరాఠిని మనమెప్పుడు చూడలేదన్నారు. చెప్పేవని శ్రీరంగ నీతులు అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడతారని విమ్మర్శించారు. సీఎం కేసీఆర్ ను ప్రజలేవ్వరు నమ్మోద్దని, రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు శీనన్న అభిమానులు షాక్ ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు.

ఇదికూడా చదవండి: అధికారం ఎవడబ్బా సొత్తుకాదు: పొంగులేటి