Telugu News

కేంద్రంపై యుద్దం ప్రకటించిన సీఎం కేసీఆర్

ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం

0

కేంద్రంపై యుద్దం ప్రకటించిన సీఎం కేసీఆర్

ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం

ఈనెల 20 రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

(హైదరాబాద్ –విజయంన్యూస్)

కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నజర్ ప్రకటించారు. మరోసారి యుద్దానికి సిద్దమైయ్యారు.. తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యలను పరిగణంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వం యుద్దం ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించేంత వరకు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో షెడ్యూల్ ను విడుదల చేసేందుకు సిద్దమైయ్యారు. అప్పటి వరకు ముందుగా కేంద్రమంత్రులను కలిసి వినతి చేసేందుకు రాష్ట్రం నుంచి మంత్రివర్గం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించారు. అలాగే ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే బీజేపీ, కేంద్ర దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని బావించారు.

ALLSO READ :- ఆర్ డి వో లను సిడివొ లుగా మార్పు..? త్వరలోనే రెవెన్యూ లొ మరో ప్రక్షాళన

పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ రైతుల సమస్యలపై కేంద్రం అనుచరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించారు. కేంద్రప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. రాష్ట్ర రైతాంగ స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోని కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి యుద్ధం ప్ర‌క‌టించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేంద్రం వైఖ‌రిని నిల‌దీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేంద్రం వైఖ‌రి ప‌ట్ల ఏం చేయాలో పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్రం చేతులెత్త‌య‌డంతో.. ఈ విష‌యాన్ని రైతుల‌కు వివ‌రించాల‌ని చెప్పారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేయాల‌ని సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర మంత్రిని క‌ల‌వ‌నున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.