Telugu News

పువ్వాడకు అనుమతుల పత్రాన్ని అందించిన సీఎం

ఖమ్మం జిల్లాకు వరమేనా..?

0

ఖమ్మం జిల్లాకు వరమేనా..?

★★ యువత అవకాశం దక్కించుకుంటారా..?

★★ ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల 

★★ అనుమతుల పత్రాన్ని అందించిన సీఎం కేసీఆర్

★★  సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 11(విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా యువతియువకులకు వరమేనా..? మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కష్టానికి ఫలితం వచ్చేనా..?అంటే నిజమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషులు..

ఖమ్మం జిల్లా యువతియువకులకు కచ్చితంగా వరమే అవుతుంది.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కష్టఫలితమో…సీఎం కేసీఆర్ ఆలోచనమో కానీ.. ఖమ్మం జిల్లా మెడిసిన్ విద్యార్థులకు ఇది నిజంగా వరమే..అదేనండి ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైంది.. ఇటీవలే ప్రభుత్వం జీవో విడుదల చేసింది కదా..? ఇప్పుడు నేరుగా సీఎం కేసీఆర్ అర్డర్ కాఫీనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో పెట్టిండ్రూ.. ఇగ ఆ కాఫీని చూసిన మంత్రి మస్తుగా కుసి అయ్యిండు అనుకోండి..

ఇది కూడా చదవండి : నాగార్జునసాగర్ డ్యామ్ ను భయపెడుతున్న వరద నీరు

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు, అనుబంధంగా ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో  సీఎంకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేయడం పట్ల ఖమ్మం జిల్లా పక్షాన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు  ఉత్తర్వు కాపీని సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అందజేశారు.
ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మడి  జిల్లా ప్రజల, విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్య‌క్తం చేసి సీఎం కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఖమ్మం జిల్లా ప్రజల కల నెరవేరిందని ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని మంత్రి పువ్వాడ అన్నారు. ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చిందని మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మెడికల్‌ కళాశాలను ప్రారంభించనున్నదని ఈ మేరకు వంద మెడికల్‌ సీట్లను కేటాయించిందన్నారు. విద్యార్థుల తరగతుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్‌ కళాశాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్‌ భవనాల సముదాయం, ఆర్‌అండ్‌బీ శాఖలకు సంబంధించిన స్థలాన్ని మెడికల్‌ కళాశాలకు అప్పగించనున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

ఇది కూడా చదవండి: నియంతృత్వ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలి:సీతక్క